KGF: కేజీఎఫ్ త్రీక్వెల్ గురించి స్పందించిన యశ్

Edited By:

Updated on: Apr 24, 2026 | 7:20 PM

కేజీఎఫ్ 3 కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త! సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని యష్ స్పష్టం చేశారు. అయితే, రాకీ భాయ్ రాకకు ఇంకా సమయం పడుతుంది. యష్ 'టాక్సిక్', 'రామాయణ'లతో, ప్రశాంత్ నీల్ 'తారక్', 'సలార్ 2'లతో బిజీగా ఉన్నారు. స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాతే కేజీఎఫ్ 3 పై దృష్టి సారిస్తారు. ఈ ఆలస్యానికి కారణాలు, భవిష్యత్ ప్రణాళికలు ఇవే.

ఏమవుతుందో? ఎలా అవుతుందో తెలియకుండా ఎదురుచూడటానికీ, ఇదే అవుతుంది.. ఇలాగే జరుగుతుంది అని ఓ క్లారిటీ రావడానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు అలాంటి వేరియేషన్‌ని అబ్జర్వ్ చేస్తు్న్నారు కేజీయఫ్‌ మూవీ లవర్స్. ఇంతకీ ఏంటా వేరియేషన్‌. వాళ్లకు తెలిసిన విషయాలేంటి? చేతికి అందినంత బంగారం తీసుకుని సముద్రంలోకి వెళ్లిన రాఖీభాయ్‌ తదుపరి మజిలీ ఏంటనే ప్రశ్న.. ఇప్పటికీ ప్రశ్నగానే ఉండిపోయింది. కేజీయఫ్‌ త్రీక్వెల్‌ వస్తేగానీ ఆ ప్రశ్నకు జవాబు దొరకదు. ఆమాటకొస్తే అసలు కేజీయఫ్‌ త్రీక్వెల్‌ ఎప్పుడు వస్తుందన్నది నిన్నటిదాకా ఓ సస్పెన్స్. కానీ, ఇప్పుడు ఆ సస్పెన్స్ కి తెరపడింది. కేజీయఫ్‌ త్రీక్వెల్‌ కచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు హీరో యష్‌. అయితే అది ఎప్పుడన్నది మాత్రం స్పష్టంగా చెప్పలేను అని క్లారిటీ ఇచ్చేశారు రాఖీభాయ్‌. ఆయన చేతిలో ప్రస్తుతం రామాయణ ఉంది. అంతకన్నా ముందు టాక్సిక్‌ ఉంది. టాక్సిక్‌ రిలీజ్‌ కావాలి. ఆ తర్వాత రామాయణ రెండు పార్టులు పూర్తవ్వాలి. ఆ తర్వాతే కేజీయఫ్‌ గురించి ఆలోచించాలి. ఇది హీరో వెర్షన్‌. మరి డైరక్టర్‌ పరిస్థితి ఏంటి? ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం తారక్‌ సినిమాతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది జూన్‌లో తుఫాను తీరాన్ని తాకుతుందని క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఎన్టీఆర్‌ సినిమా పూర్తయ్యాక, ప్రశాంత్‌ నీల్‌ నేరుగా కేజీయఫ్‌3 మీద ఫోకస్‌ చేస్తారని అనుకోలేం. ఎందుకంటే, మధ్యలో సలార్‌ సీక్వెల్‌ ఉంది. ఈ సినిమా గురించి ఆలోచించాలి. వీటన్నిటికీ ప్యారలల్‌ గా కేజీయఫ్‌ త్రీక్వెల్‌కి స్క్రిప్ట్ సిద్ధం చేయాలి. స్క్రిప్ట్ లాక్‌ కానిదే త్రీక్వెల్‌ గురించి ఏం మాట్లాడినా వర్త్ ఉండదన్నది యష్‌ మాట. స్క్రిప్ట్ గురించి నీల్‌తో మాట్లాడుతూనే ఉన్నానని ఆయన చెప్పిన మాటలు కొంతలో కొంత ఫ్యాన్స్ కి ఊరట కలిగిస్తున్నాయన్నది మాత్రం పక్కా.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TSRTC: మూడో రోజుకు ఆర్టీసీ సమ్మె.. చర్చలు షురూ.. ఆ మూడు డిమాండ్లే కీలకం

Gold Price Today: ఇదే మంచి ఛాన్స్‌.. తగ్గిన బంగారం ధరలు

తేమతో కూడిన ఉక్కపోత.. ఎందుకు ప్రమాదకరం ??

ప్రపంచంలోని 20 హాటెస్ట్ నగరాల్లో 19 మనవే !!

ఆధార్ నెంబర్‌ ఉంటే.. డబ్బులు డ్రా చేయచ్చా ??

Follow Us