Jr NTR: ఎన్టీఆర్ న్యూ లుక్ రివీల్ !! తారక్ మేకోవర్‌కు ఫ్యాన్స్ ఫిదా
కొన్నాళ్లుగా బయటికి రాని జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కోసం సిద్ధమైన తన న్యూ లుక్‌తో అభిమానుల ముందుకు వచ్చారు. జిమ్‌లో చెమటోడ్చి సాధించిన ఈ స్టైలిష్ మేకోవర్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్న తారక్, తర్వాత దేవర 2పై దృష్టి సారించనున్నారు. ఆయన మేకోవర్‌కు భారీ స్పందన లభించింది.
ఎన్టీఆర్ ఎలా ఉన్నారు..? జూనియర్ లుక్ ఎలా ఉండబోతుంది..? ప్రశాంత్ నీల్ సినిమా కోసం తారక్ ఎలా మేకోవర్ అయ్యారు..? కొన్నాళ్లుగా ఫ్యాన్స్ మదిలో ఉన్న అనుమానాలు ఇవి. వీటన్నింటికి ఒకే లుక్‌తో ఆన్సర్ ఇచ్చారు జూనియర్. ఇన్నాళ్లుగా బయటికి రాని తారక్ ఉన్నపలంగా అభిమానుల ముందుకొచ్చేసారు. మరి ఆయనెలా ఉన్నారు..? చూస్తున్నారుగా ఎన్టీఆర్ న్యూ లుక్.. ఇలా ఈయన్ని చూసి మురిసిపోతున్నారు అభిమానులు. కొన్ని రోజులుగా అస్సలు బయటికి రాలేదు తారక్. అదేంటంటే ప్రశాంత్ నీల్ సినిమా కోసం మేకోవర్ అవుతున్నారన్నారు. అదెలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఎందుకంటే అల్లు శిరీష్, విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ మ్యారేజెస్‌కు కూడా లుక్ రివీల్ అవుతుందనే రాలేదు తారక్. కొన్నాళ్లుగా నీల్ సినిమా కోసం బాగా చెమటోడుస్తున్నారు తారక్. ఈ సినిమా కోసం ఎంతగా అంటే.. ఉంటే సెట్‌లో లేదంటే జిమ్‌లో వర్కవుట్స్ అన్నట్లు మారిపోయారు. అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ తాజాగా బయటికొచ్చారు తారక్. ఆయన లుక్ చూసి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. స్టైలిష్ మేకోవర్‌తో పిచ్చెక్కిస్తున్నారీయన. బెంగళూరులోని ఓ హాస్పిటల్ ఓపెనింగ్‌కు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్‌కు అక్కడి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. సిఎం ఎన్టీఆర్ అంటూ ప్లకార్డులు పట్టుకుని హంగామా చేసారు. తారక్ వచ్చిన ఏరియా అంతా బ్లాక్ అవ్వడం కాదు.. కంట్రోల్ చేయలేనంతగా ఫ్యాన్స్‌తో నిండిపోయింది. అదే వేదికపై సినిమాలతో పాటు చాలా విషయాలు ముచ్చటించారు. కొన్ని రోజులుగా ప్రశాంత్ నీల్ సినిమాతోనే బిజీగా ఉన్న తారక్.. దీని తర్వాత దేవర 2పై ఫోకస్ చేయనున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ప్రశాంత్ నీల్ సినిమాలో మాఫియా డాన్‌గా తారక్ నటిస్తున్నారని తెలుస్తుంది. గతంలో బాద్షాలో డాన్‌గా కనిపించిన ఎన్టీఆర్.. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ తరహా పాత్రలోనే కనిపించబోతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varanasi: వారణాసి మూవీ అప్‌డేట్స్.. మంచు కొండల్లో మహేష్ విన్యాసాలు
Nayanthara: అక్కడ నయన్ టాప్.. ముద్దుగుమ్మ స్పీడ్‌కు కనీసం పోటీ లేదుగా
Nenu Ready: త్రినాథరావు మార్క్ కామెడీతో వస్తున్న నేను రెడీ
కుర్ర హీరోలను రెమ్యునరేషన్లో.. దాటేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు