బంగారం లాంటి ఛాన్స్‌ వస్తే.. ఈ పిల్ల కాళ్లతో తన్నింది..

Updated on: Jul 16, 2025 | 8:31 PM

సక్సెస్ ! దీని కోసమే అందరూ పరితపిస్తుంటారు. సక్సెస్‌ వేటలో పరిగెడుతుంటారు. ఆ సక్సెస్ కారణంగా వచ్చే డబ్బును.. రెస్పెప్ట్‌ను ఆస్వాదిస్తుంటారు. జాను లిరి కూడా అంతే! ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ.. సక్సెస్ అయింది ఈమె. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ట్రోల్ కు గురైంది. నెట్టింట వైరల్ అయింది. మొత్తానికి తెలుగులో ఉన్న వన్‌ ఆఫ్ ది క్రేజీయెస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా గుర్తింపుతెచ్చుకుంది.

కట్ చేస్తే తాను తీసుకున్న ఓ నిర్ణయంతో.. తాను పెట్టుకున్న ఓ నియయంతో బంగారం లాంటి ఛాన్స్‌ను మిస్‌ చేసుకుందే అనే కామెంట్‌ను వచ్చేలా చేసుకుంటోంది ఈమె. తెలుగులో వన్‌ ఆఫ్ ది టాప్‌ రేటింగ్‌ షో .. బిగ్ బాస్‌! ఇప్పటికే ఎనిమిది సీజన్లు కంప్లీట్ చేసుకున్న గేమ్‌ షో.. త్వరలో తొమ్మదో సీజన్‌తో మన ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే జాను లిరి బిగ్ బాస్‌ సీజన్‌ 9కి వెళుతుందనే టాక్ నడుస్తోంది నెట్టింట. ఇక దీనిపైన తాజాగా ఈమె రియాక్టైంది. తాను బిగ్ బాస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదంటూ తేల్చేసింది. గతంలో రెండు సీజన్ల కోసం తనకు షో మేకర్స్‌ నుంచి పిలుపు వచ్చిందని.. కానీ తాను రిజెక్ట్ చేశానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అటు వైపు లక్షల్లో రెమ్యునరేషన్ వస్తుందంటే కూడా వెళ్లవా అంటూ.. హోస్ట్ అడగగా.. జానును డబ్బుతో కొనలేరంటూ నవ్వేసింది. తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అంతేకాదు బంగారం లాంటి ఛాన్స్ వస్తే కాలితో తంతుదేంటి ఈ పిల్ల అనే కామెంట్ కూడా తన ఫ్యాన్స్‌ అండ్ ఫాలోవర్స్‌తో వచ్చేలా చేసుకుంటోంది. జాను లిరి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

3 నిమిషాలకు 3 కోట్లు.. ఏ స్టార్ ఫిల్మ్ అయినా.. మనీ మ్యాటర్లో నో కాంప్రమైజ్‌!

18 ఏళ్లు ఎదురుచూసినా..ఆ కోరిక తీరకుండానే.. పాపం! కోట

కొంచెం తింటే ఏం కాదులే అనుకుంటున్నారా.. అదే డేంజర్‌

అదేమన్నా బొమ్మ అనుకుంటివా.. ప్రాణాలు తీసే కింగ్ కోబ్రా.. అలా ఎలా నిలబెట్టావ్ అన్న