Jabardasth Mahidhar: నీ డ్రామాలన్నీ వ్యూస్ కోసమేగా..? మహీని తిట్టిపోస్తున్న నెటిజన్లు

Updated on: Feb 10, 2026 | 7:39 PM

జబర్దస్త్ ఫేమ్ మహిధర్ తన యూట్యూబ్ ఛానెల్‌ను (10 లక్షల సబ్‌స్క్రైబర్లు) అమ్మకానికి పెట్టడం చర్చనీయాంశమైంది. వ్యాపారంలో రూ. 55 లక్షల నష్టపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే, నెటిజన్లు దీనిని వ్యూస్ కోసమే చేసే డ్రామాగా విమర్శిస్తున్నారు. యూట్యూబ్ ఆదాయం ముందు 40 లక్షలు పెద్ద విషయమా అని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామం యూట్యూబ్ వర్గాల్లో సంచలనం రేపుతోంది.

జబర్దస్త్ కామెడీ షోతో ఎంతో మంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో మహిధర్ ఒకడు. జబర్దస్త్ కామెడీ షోతోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న మహిధర్.. ఆ గుర్తింపును బేస్ చేసుకుని.. యూట్యూబ్‌లో అడుగుపెట్టాడు. రివ్యూవర్ అవతారమెత్తాడు. తన కంటెంట్‌తో.. యూట్యూబ్‌లో 10లక్షల సబ్‌స్కైబర్స్‌ను సాధించాడు. మంచి వ్యూయింగ్ రేట్‌తో గట్టిగానే సంపాదిస్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే ఓ బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన మహిధర్.. తాను నష్టపోయినట్టు.. తన యూట్యూబ్‌ ఛానెల్‌ను అమ్మేస్తున్నట్టు.. రీసెంట్‌గా ఓ వీడియోని పోస్ట్‌ చేసి.. ఇప్పుడు నెట్టింట విమర్శలపాలవుతున్నాడు. ఇక మీదట మహీధర్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ ఉండకపోవచ్చని.. తను పోస్ట్ చేసిన వీడియోలో చెప్పిన మహిధర్.. తన ఛానెల్ ని అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు తన ఛానల్ ఉండాలి అనుకుంటే.. మీ సపోర్టు కావాలంటూ తన సబ్‌స్కైబర్స్‌ను రిక్వెస్ట్ చేశాడు.కొన్ని నెలల క్రితం తాను ఒక బిజినెస్ మొదలు పెట్టానని.. అయితే బిజినెస్ లో 55 లక్షలకు పైగా నష్టపోయానంటూ మహిధర్ చెప్పుకొచ్చాడు. సుమారుగా రూ .65 లక్షల వరకు పెట్టుబడి పెడితే.. కేవలం రూ .10 లక్షల రూపాయలు మాత్రమే మిగిలిందని ఎమోషనల్ అయ్యాడు. తాను దాచుకున్న రూ .40 లక్షల రూపాయలను బిజినెస్ లో పెట్టానని.. అలాగే బయట నుంచి 25 లక్షల రూపాయల వరకు అప్పు తెచ్చి మరీ ఇన్వెస్ట్ మెంట్ చేశానంటూ మహి చెప్పుకొచ్చాడు. కానీ మొత్తం మీద 60 లక్షల రూపాయల వరకు లాస్ అయ్యానని.. ఇప్పుడు ఈ అప్పు తీర్చాల్సి వచ్చిందని.. అందుకోసమే తన ఛానల్ ని అమ్మడానికి రెడీ అయ్యానంటూ చెప్పుకొచ్చాడు. కొంత మంది తన ఛానెల్‌ను తీసుకోడానికి ముందుకు వచ్చారని.. ఒక్క సబ్ స్క్రైబర్స్ కు రూ .4రూపాయలు చొప్పున.. 10 లక్షల మంది సబ్స్క్రైబర్క్స్‌కు 40 లక్షల రూపాయల వరకు ఇస్తామని చెప్పినట్టు చెప్పుకొచ్చాడు. కానీ కానీ ఇక్కడే ఓ మెలిక ఉందని.. ఒకవేళ తన ఛానల్ అమ్మేస్తే పూర్తిగా ఇకమీదట మరో ఛానెల్ చేయడానికి వీలు లేకుండా.. తన ఛానెల్‌ను కొనేందుకు వచ్చిన వారు కండిషన్ పెట్టారన్నారు. అందులోనూ మూవీస్ రిలేటెడ్ గా ఏది మాట్లాడకూదని.. వారు మెలిక పెట్టినట్టు చెప్పుకొచ్చాడు. అయితే మహిధర్ వీడియోపై నెట్టింట చాలా మంది నెగెటివ్ కామంట్స్ చేస్తున్నారు. ఈ డ్రామాలన్నీ వ్యూస్ కోసమే అంటూ నెట్టింట కామెంట్ చేస్తున్నారు. నీ యూట్యూబ్‌ ఇన్‌కమ్ ముందు 40 లక్షలు పెద్ద మ్యాటరా..? కేవలం రీచ్‌ కోసం.. వ్యూస్‌ కోసమే ఈ వీడియో చేశావులే అంటూ మహిని దారుణంగా విమర్శిస్తున్నారు. ఈ విషయాన్ని అంతా చెబుతూ వీడియో చేసింది ఇక మీదట రివ్యూస్ కానీ మూవీస్ కి సంబంధించిన విషయాలని చేయకూడదని చెప్పారు. యూట్యూబ్ కొనేవాళ్లు ఈ రూల్స్ పెట్టేసరికి తనకి అర్థం కాక ఈ వీడియో చేశాను’ అని మహిధర్ చెప్పుకొచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎట్టకేలకు రవితేజ కూడా వస్తున్నాడు.. ఎప్పుడంటే ??

Gold Price Today: ఏ మాత్రం తరగని బంగారం వెండి, ధరలు.. ఈ రోజు ఎంతంటే

Hyderabad: హైదరాబాద్‌లో భూ ప్రకంపనలు..

నిర్దోషిగా తేలిన కొన్ని గంటలకే కానిస్టేబుల్ మృతి

ఏకంగా ఎమ్మల్యేపైనే క్షుద్రపూజలు.. 2 నెలలుగా అనారోగ్యంతో