నరేష్‌కు కాబోయే భార్య ఈమే.. త్వరలో పెళ్లి

Updated on: Oct 16, 2025 | 3:39 PM

జీవితంలో ఎవరికైనా ఓ తోడు అవసరం. మన వెన్నంటి నడుస్తూ.. కష్టసుఖాల్లో నీడగా ఉండే జోడీ ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. అయితే ఈ ముఖ్యమైన పనిలో సక్సెస్ అయ్యాడు జబర్దస్త్ నరేష్. తనకంటూ ఓ అమ్మాయిని చూసుకున్న ఈ స్టార్ కమెడియన్ తర్వలో పెళ్లి పీఠలెక్కబోతున్నా అంటూ కొన్ని రోజుల నుంచి చెప్పుకొంటూ వస్తున్నాడు.

ఇక ఇప్పుడు ఏకంగా ఆ అమ్మాయిని అందరికీ పరిచయం చేశాడు. రీసెంట్‌గా ఓ షోలో పాల్గొన్న జబర్దస్త్ పొట్టి నరేష్‌… తన చేసుకోబోయే అమ్మాయి నవ్యని వేదికపైకి తీసుకొచ్చాడు. ఈ షో వేదికగానే పెళ్లి చూపులు ఘట్టాన్ని ముగించాడు. ఆ అమ్మాయి మాటలు వింటూ మురిసిపోయాడు. తను చూపించే ప్రేమకు సిగ్గుపడిపోయాడు. ఇక డిగ్రీ పూర్తి చేసిన నవ్య. స్వయంగా నరేష్‌ను పెళ్లి చేసుకుంటానంటూ ముందుకు వచ్చింది. నరేష్‌కి కూడా ఆ అమ్మాయి నచ్చడం.. దాంతో పాటే నరేష్‌ ఫ్యామిలీ కూడా ఓకే చెప్పడంతో.. వీరిద్దరి పెళ్లి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. త్వరలో నవ్య- నరేస్ పెళ్లి చాలా గ్రాండ్‌ గా జరగనున్నట్టు ఆయన తండ్రి మాటల ద్వారా తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డాన్స్‌ కాదు..చిన్నపాటి రొమాన్స్‌.. పవన్‌ తీరుతో.. మొఖం మాడ్చుకున్న రీతూ

పైసలు చాలట్లేదు.. ఈ మంత్రి పదవి నాకొద్దు.. సీనియర్ హీరో ఆవేదన

నా భర్తతో అదే సమస్య అందుకే నాలుగేళ్లుగా శ్రీనివాస్‌తో.. తన బాధను చెప్పుకున్న మాధురి

యాడ దొరికిన సంతరా అయ్యా..బొట్టు బిళ్లల కోసం లొల్లేంట్రా

అతనితో ప్రేమలో ఉన్నా.. కానీ పెళ్లి మాత్రం చేసుకోను