Allu Aravind: బన్నీ అలా ఎందుకు చేస్తాడు..? మీరు విన్నది తప్పు – అరవింద్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముంబైకి మారుతున్నారనే వార్తలను ఆయన తండ్రి అల్లు అరవింద్ ఖండించారు. 'రాకా' సినిమా షూటింగ్ నిమిత్తం బన్నీ ప్రస్తుతం ముంబైలో ఎక్కువ సమయం గడుపుతున్నారని, అయితే హైదరాబాద్‌లోనే ఆయనకు ఇల్లు, పిల్లల చదువులు, స్నేహితులు ఉన్నారని స్పష్టం చేశారు. ముంబైలో స్థిరపడే ప్రణాళికలు లేవని అరవింద్ కుండబద్దలు కొట్టారు. ఇది కేవలం షూటింగ్ కోసం తాత్కాలిక నివాసం మాత్రమేనని తెలిపారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ విడిచి పెట్టనున్నాడని, తన కుటుంబంతో కలిసి ముంబైలో తాత్కాలికంగా స్థిరపడనున్నారని ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ న్యూస్ పైనే తాజాగా అల్లు అర్జున్ ఫాదర్ అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం అట్లీ కుమార్ దర్శకత్వంలో బన్నీ ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దీంతో అల్లు అర్జున్ తన కుటుంబంతో పాటు ముంబైలో తాత్కాలికంగా స్థిరపడనున్నారని న్యూస్. అయితే ఈ వార్తలపై అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ రియాక్టయ్యారు. అల్లు అర్జున్ ముంబైకి వెళ్తున్నట్లు వచ్చిన వార్తలు నిజం కాదని కుండబద్దలు కొట్టినట్టు గా చెప్పుకొచ్చారు. ‘బన్నీ కొత్త సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ముంబైలో జరుపుకుంటున్నందున చాలామందికి అలా అనిపించిఉండవచ్చు. కానీ, అర్జున్ మనసు ఎప్పుడూ హైదరాబాద్ చుట్టే ఉంటుంది. అతనికి ఇక్కడే సొంత ఇల్లు ఉంది. పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. తన స్నేహితులందరూ హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారు. అలాంటప్పుడు అతను ముంబైకి ఎందుకు వెళ్తారు..? ముంబైలో స్థిరపడాలనే ప్రణాళికలు బన్నీకి లేవు. అయితే, ప్రస్తుతం షూటింగ్ పనుల వల్ల ఎక్కువ సమయం ముంబైలో ఉంటున్నాడు అంటూ.. అరవింద్ మీడియాతో చెప్పుకొచ్చారు. పుష్ప2 వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్… రాకా సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొణె ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సంస్థ సుమారు 800 కోట్ల బడ్జెట్ తో రాకా సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబయ్‌లో శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. దీంతో పాటు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోనూ ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు బన్నీ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోజా కూతురికి ‘Herman B Wells’ అవార్డ్.. గర్వంతో పొంగిపోయిన రోజా
గుంతల రోడ్లతో చికాకు.. పోర్షే కారుపైనే సిమెంట్ కలిపిన యువకుడు..
Raaka: ఆందోళన వద్దు.. దీపిక వల్ల ‘రాకా’ ఆగదు
Rakasa OTT: సంగీత్ శోభన్.. రాకాస OTT అప్డేట్ !!
Chalaki Chanti: నా తర్వాత వచ్చిన సుడిగాలి స్టార్ అయ్యాడు !! కానీ నేను..
