ఎర్ర బటన్, పచ్చ బటన్ ఐబొమ్మ రవి పరిస్థితి ఇదే!
ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవి బెయిల్ పై విడుదలయ్యారు. దాదాపు 90 రోజులు జైలులో గడిపిన రవికి తెలంగాణ హైకోర్టు కఠినమైన షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియా వాడకం, ఇంటర్నెట్ వినియోగంపై నిషేధంతో పాటు, ప్రతిరోజూ సీసీఎస్ పోలీసుల ముందు హాజరుకావాలనే నిబంధనలు అతని స్వేచ్ఛను పరిమితం చేశాయి.
ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవి సుదీర్ఘ కాలం జైలు జీవితం తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. దాదాపు 90 రోజులకు పైగా చంచల్ గూడ జైలులో గడిపిన రవికి తెలంగాణ హైకోర్టు పలు కఠిన షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. బెయిల్ లభించినప్పటికీ, అతని కదలికలు, కమ్యూనికేషన్లపై తీవ్ర ఆంక్షలు విధించారు. రవికి విధించిన ప్రధాన షరతులలో సోషల్ మీడియా, వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ (వీపీఎన్), ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సాధనాలను ఉపయోగించరాదని ఉంది. అంతేకాకుండా, ఆయన తన పాస్ పోర్ట్ ను అధికారులకు సమర్పించారు. కూకట్ పల్లిలో నివసిస్తున్న రవి ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు బషీర్ బాగ్ లోని సీసీఎస్ పోలీసుల ముందు హాజరై సంతకం చేయాలి. ఇంటర్నెట్ అత్యవసరమైతే సీసీఎస్ పోలీసుల సమక్షంలో మాత్రమే ఉపయోగించాలి.
Loading...
Unable to load recommendations.
Follow Us
