అంబులెన్స్‌లో తిరుగుతూ అమ్మాయిలను చంపేసే సైకో.. OTTలో ఈ రోడ్ సైడ్ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?

Updated on: May 26, 2026 | 1:36 PM

హైదరాబాద్‌లో వరుస హత్యలు చేస్తున్న సీరియల్ కిల్లర్‌ను పట్టుకునేందుకు ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ చేసే దర్యాప్తు నేపథ్యంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘హైవే’. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో అభిషేక్ బెనర్జీ సైకో కిల్లర్ పాత్రలో అద్భుతంగా మెప్పించాడు. ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ మూవీ ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు మంచి ఛాయిస్‌గా నిలుస్తోంది.

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చాలానే ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషలకు చెందిన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ జానర్ లో రోడ్ సైడ్ థ్రిల్లర్ మూవీస్ కు కూడా మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు మనం చర్చించుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. హైదరాబాద్ నగరంలో ఓ సీరియల్ కిల్లర్ వరుసగా అమ్మాయిలను దారుణంగా హతమారుస్తుంటాడు. దీంతో పోలీసులు అతనిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ ను నియమిస్తారు. ఆమె తన దైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ కిల్లర్‌ను పట్టుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తుంది. సిటీలోనూ, ఔట్ స్కర్ట్స్ లోనూ ఎక్కడ పడితే అక్కడ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేయిస్తుంది. కానీ ఆ సైకో కిల్లర్ తెలివిగా అంబులెన్స్ లో తిరుగుతూ పోలీసులను బోల్తా కొట్టిస్తుంటాడు. మరి ఆ సైకో కిల్లర్ ఎవరు? ఎందుకు అమ్మాయిలనే టార్గెట్ చేసి చంపుతున్నాడు? చివరికి ఆ క్రిమినల్ ను పోలీసులు ఎలా పట్టుకున్నారన్నదే తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఆద్యంతం ఆసక్తికరంగా ఊహించని ట్విస్టులతో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు… హైవే. రైటర్, సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ కె.వి. గుహన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించాడు. మానస రాధాకృష్ణన్, సయామీ ఖేర్, అభిషేక్ బెనర్జీ, రమ్య పసుపులేటి, సత్య, జాన్ విజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించాడు. ఇందులో అమ్మాయిలను మానసికంగా హింసించి దారుణంగా చంపేసే సైకో కిల్లర్ పాత్రలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అభిషేక్ బెనర్జీ అద్బుతంగా నటించాడు. సినిమా మరీ సూపర్బ్ గా ఉందని చెప్పలేం కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. ఓటీటీలో మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకునేవారికి ఈ హైవే మూవీ ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

RGV: ఆ స్టార్‌పై నాకు కోపం, ద్వేషం.. RGV ఎమోషనల్ ట్వీట్

రూ. లక్ష క్యాష్‌ బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన శునకం..!

Randeep Hooda: ఆ సినిమాలో ఇరుక్కుని.. మరిన్ని ఇబ్బందులు పడాలనుకోలేదు

Donald Trump: మోదీకి నేను బిగ్‌ ఫ్యాన్‌.. ఏది అడిగినా ఇచ్చేస్తా

చరిత్ర సృష్టించిన ఆకలి.. రెండు పిజ్జాల ధర రూ.7,400 కోట్లా

Follow Us