Tollywood: ఆ సినిమా కూడా చేసుంటే.. ఈ బేబీ ఎక్కడికో వెళ్లిపోయేదిగా
వైష్ణవి చైతన్య.. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదట్లో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ ద్వారా యూట్యూబ్ లో గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా షణ్ముక్ జస్వంత్ తో కలిసి ఆమె చేసిన సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ ఏ స్థాయిలో విజయం సాధించిందో చెప్పక్కర్లేదు.ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. షార్ట్ ఫిల్మ్స్, సినిమాలు, ఇన్ స్టా రీల్స్ ద్వారా భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.
పదిహేనేళ్ల వయసులోనే నటిగా అవకాశాల కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేసిందట వైష్ణవి. గతంలో బేబీ మూవీ ప్రమోషన్లలో తన జర్నీ గురించి అనేక విషయాలు పంచుకుంది. ఓ ఈవెంట్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యాన్స్ చేస్తే ఏడు వందలు ఇచ్చారని తెలిపింది. ఇక బేబీ సినిమాకు ముందు ఆమె రెండు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుందట. అందులో ఒకటి బలగం సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డ్స్ గెలుచుకుంది. అయితే ఈ సినిమాకు ముందుగా వైష్ణవిని ఎంపిక చేసుకున్నారట. కానీ అప్పటికే ఆమె బేబీ సినిమాతో బిజీగా ఉండడంతో బలగం నుంచి తప్పుకుందట. దీంతో బేబీ కోసం బలగం బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన బేబీ మూవీ సైతం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో తెలుగులో ఆమె క్రేజ్ మారిపోయింది.
వాష్రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
కదులుతున్న రైలులో పూజలు.. రైల్వే అధికారుల రియాక్షన్ ఇదే!
అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో
ఫోన్లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి

