భర్తతో స్టార్ హీరోయిన్ కటీఫ్? ఇన్‌స్టాతో బట్టబయలు
తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లో నటించి మెప్పించిన హన్సిక మూడేళ్ల క్రితం ప్రముఖ వ్యాపార వేత్త సోహైల్ కతురియాను పెళ్లి చేసుకుంది. వరుడికి అప్పటికే పెళ్లై పోయి విడాకులు తీసుకున్నప్పటికీ తన మనసుకు నచ్చడంతో మను వాడింది. పెళ్లైన కొత్తలో వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా కనిపించారు. హనీమూన్, వెకేషన్లు, టూర్లు అంటూ దేశ, విదేశాలు తిరిగొచ్చారు.
ఈ స్టార్ కపుల్ ఫొటోలు కూడా అప్పట్లో నెట్టింట బాగా వైరలయ్యాయి. అలాంటిది.. ఇప్పుడు వీరిద్దరూ విడిపోతున్నట్లు న్యూస్ బయటికి రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. హన్సిక – సోహైల్ గత రెండేళ్లుగా విడివిడిగా నివసిస్తున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. స్టార్ హీరోయిన్ తన తల్లితో ఉంటే.. భర్త తన పేరెంట్స్ తో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. ఇలా పెళ్లైన మూడేళ్లకే విడాకుల విషయంతో వార్తల్లో హాట్ టాపిక్ అవుతోంది హన్సిక. అయితే తమ విడాకుల ప్రచారంలో ఎలాంటి నిజం లేదని సోహైల్ చెబుతున్నప్పటికీ.. హన్సిక నుంచి మాత్రం ఇండైరెక్ట్ సైన్స్ అందుతున్నాయి. గతంలో హన్సిక తన భర్తతో కలిసున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేది. అయితే ఈ మధ్యన సింగిల్ గా ఉన్న ఫొటోలు మాత్రమే పంచుకుంటోంది. ఇక ప్రతి ఏడాది పెళ్లిరోజున స్పెషల్ ఫోటోలు షేర్ చేసేది హన్సిక. గతేడాది డిసెంబర్‌లో కూడా సెకండ్ యానివర్సరీ అంటూ ఓ పోస్ట్ పెట్టిందీ అందాల తార. మరి ఇంత కలివిడిగా ఉన్న ఈ ఆలుమగలు ఎందుకు విడిగా ఉంటున్నారు? లేదా లేనిపోని రూమర్లు సృష్టిస్తున్నారా? అనే విషయంపై హన్సిక స్పందించాల్సి ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జాన్వీ బిగ్ స్కెచ్.. చరణ్ సినిమాతో టార్గెట్ అఛీవ్డ్
తొమ్మిదేళ్ల కలను నిజం చేసుకునేందుకు.. పెళ్లి వాయిదా వేసుకున్న స్టార్ హీరో
‘మానసికంగా కుంగిపోయా’ రష్మీ షాకింగ్ ట్వీట్ !
ఎలా ఉండేది.. ఎలా అయింది! వైరలయ్యేందుకు కాదుగా ఈ డ్రామాలు?
బైకుపై కూర్చున్న వ్యక్తి.. సడన్‌గా వచ్చిన పాము.. ఆ తర్వాత..?