Gaja 2026: గజ సినిమా టీజర్ టాక్.. మంచి రెస్పాన్స్ వస్తుంది..

Edited By:

Updated on: Aug 21, 2026 | 10:11 PM

సతీష్ జై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘గజ’ సినిమా టీజర్‌తోనే మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఫర్నాజ్ శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ‘గట్స్ కా బాప్’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాలో మాస్ యాక్షన్‌తో పాటు సస్పెన్స్ అంశాలు కూడా ఉండనున్నాయి. అశిష్ విద్యార్థి, గరుడ రామ్ వంటి నటుల క్యాస్ట్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఈ రోజుల్లో భారీ సినిమాల కంటే కొన్నిసార్లు చిన్న సినిమాలే తమ కంటెంట్‌తో సర్‌ప్రైజ్ చేస్తుంటాయి. అలా వస్తున్న సినిమానే గజ.. సతీష్ జై నటిస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టీజర్ నుంచే ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గజ సినిమాలోని మరిన్ని విశేషాలను ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం.. సతీశ్‌ జై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘గజ’ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. తక్కువ టైమ్‌లోనే మంచి వ్యూస్ దక్కించుకుని బజ్ క్రియేట్ చేస్తుంది గజ సినిమా. ఫర్నాజ్‌ శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి డా.మైత్రి శరణ్‌ నిర్మాత. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న గజ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన టీజర్ లాంచ్ కార్యక్రమానికి హీరో మంచు మనోజ్‌ హాజర్యాయరు. గజ సినిమాకు ‘గట్స్‌ కా బాప్‌’ అనే ట్యాగ్‌లైన్‌ పెట్టారు డైరెక్టర్ కమ్ హీరో సతీష్ జై. ఈ కథకు ఆ సత్తా ఉందని.. ఆడియన్‌గా ఆలోచించి రాసుకున్న కథ ఇదని చెప్పుకొచ్చారాయన. ఈ టీజర్‌ కేవలం శాంపిల్‌ మాత్రమే అని.. సినిమా అంతకు మించి ఉంటుందని నమ్మకంగా చెప్పారు ఈ హీరో. గజ సినిమాతో నటిగా తనకు మంచి గుర్తింపు వస్తుందన్నారు హీరోయిన్ ఫర్నాజ్. భగవద్గీతలోని వాక్యాలను వాడుకుంటూ కట్ చేసిన టీజర్‌లో కేవలం మాస్ యాక్షన్ మాత్రమే కాదు.. సస్పెన్స్ కూడా ఉండేలా ప్లాన్ చేసారు దర్శకుడు సతీష్. దానికితోడు అశిష్ విద్యార్థి, గరుడ రామ్ లాంటి స్టార్ క్యాస్ట్ ఈ సినిమాకు బలం. త్వరలోనే గజ ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్‌.. స్కూల్‌ను సీజ్‌ చేసిన అధికారులు

రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్‌ చూస్తే వెన్నులో వణుకే!

యూట్యూబ్ వ్యూస్ లెక్కింపులో కీలక మార్పు.. ఆగస్టు 24 నుంచి కొత్త విధానం!

LPG: ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త!

లోన్ తీసుకునే వారికి అదిరిపోయే శుభవార్త! బ్యాంకుల ఇష్టారాజ్యానికి చెక్!

Loading...
Unable to load recommendations.
Follow Us