కక్కలేక మింగలేక.. పాపం డైరెక్టర్‌ గారు ఎంత ఇబ్బంది పడ్డారో..

Updated on: Apr 19, 2025 | 7:28 PM

ఇప్పుడున్న షోలు ఎలా ఉన్నాయన్నది పక్కకు పెడితే.. ఆ షోల్లో హోస్ట్‌లుగా చేస్తున్న వారి పరిస్థితి... గెస్ట్‌లుగా వెళుతున్న వారి పరిస్థితి విచిత్రంగా ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే సారంగ పాణి జాతకం మూవీ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణకు కూడా ఎదురైంది. దాంతో పాటే ఆయన చుట్టు .. ఆయన చేసిన కామెంట్స్‌ చుట్టూ వివాదం ముసురుకుంది.

అది కాస్తా పెద్దగా అవ్వడంతో ఆయన క్లారిటీ ఇచ్చే వరకు వచ్చింది. ఇక అసలు విషయం ఏంటంటే.. తెలుగు సినీ చరిత్రలో కల్ట్ క్లాసిక్ సాంగ్‌గా నిలిచిన వాటిలో ఆహా నా పెళ్లి అంట సాంగ్ ఒకటి. ఈ పాటలో మహానటి సావిత్రి అద్భుతంగా డాన్స్ చేశారు. డాన్స్ మాత్రమే కాదు ఆమె అభినయం ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు. ఎంతలా అంటే.. ఇప్పటికీ ఆ సాంగ్ వింటే మహానటి సావిత్రి హావభావాలు అందరికీ కళ్ళళ్లో మెదులుతుంటాయి. అలాంటి సాంగ్‌కు రీసెంట్‌గా ఓ డాన్స్ షోలో అసభ్యకరంగా స్టెప్పులేశారు. పొట్టి డ్రెస్‌లో బెల్లీ డ్యాన్స్‌తో పాటను చెడగొట్టేశారు. దాంతో తెలుగు ప్రేక్షకులు మండిపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: హీరోలకు లేని నొప్పి.. ఫ్యాన్స్‌కు ఎందుకు | అల్లు అర్జున్‌కు హ్యాండిచ్చిన స్టార్ హీరోయిన్

చరిత్ర సృష్టించిన ట్రాఫిక్ జాం.. 12 రోజులు రోడ్లపై నరకం చూసిన జనం..

దొంగలకు కూడా లక్షల్లో వేతనం.. వారు చేసే పని తెలిస్తే మైండ్‌ బ్లాంక్‌

హాట్ ఎయిర్ బెలూన్ తో పై కెళ్లిన వ్యక్తి.. తెగి పడ్డ తాడు.. ఏం జరిగిందంటే..

వామ్మో ..! నీళ్ల బాటిల్‌ ధర రూ. 50 లక్షలా?