Dhanush: ధనుష్‌కు సొంత ఇండస్ట్రీలో ఊహించని కష్టం
పక్క భాషల్లో ధనుష్ హిట్స్ అందుకున్నా, తమిళంలో మాత్రం సరైన బ్లాక్‌బస్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. తిరుచిత్రంబలం తర్వాత కోలీవుడ్‌లో విజయం దక్కలేదు. కర సినిమాతో ధనుష్ మళ్ళీ ఫామ్‌లోకి వస్తారా అని అభిమానులు ఆశగా చూస్తున్నారు. గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో, కుటుంబం కోసం ఓ మాజీ దొంగ మళ్ళీ పాత దారి తొక్కే కథతో కర వస్తోంది. ధనుష్‌కు ఈ చిత్రం కోలీవుడ్‌లో సాలిడ్ సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.
పక్క ఇండస్ట్రీల్లో రప్ఫాడిస్తున్న ధనుష్.. సొంత ఇండస్ట్రీలో మాత్రం ఎందుకో వెనకబడిపోతున్నారు. సాలిడ్ హిట్ కోసం కొన్నేళ్లుగా వేచి చూస్తున్నారీయన.. మరి అదెప్పుడు దక్కుతుంది? వరస ఫ్లాప్స్, యావరేజ్ సినిమాలతో సతమతమవుతున్న ధనుష్.. కర సినిమాతో బ్లాక్‌బస్టర్ మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారా.. కోల్పోయిన ఫామ్ మళ్ళీ అందుకుంటారా..? గత మూడేళ్లలో తెలుగులో సార్, కుబేరా లాంటి హిట్స్ అందుకున్నారు ధనుష్.. అలాగే హిందీలో తేరే ఇష్క్ మై అంటూ అదరగొట్టారు.. కానీ సొంత ఇండస్ట్రీ తమిళంలో మాత్రం టైమ్ ఏమాత్రం కలిసిరావడం లేదు. 2022లో వచ్చిన తిరుచిత్రంబలం తర్వాత ఇప్పటివరకు ఈ స్టార్ హీరోకు అక్కడ సరైన బ్లాక్ బస్టర్ దక్కకపోవడం ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఆ మధ్య అన్నయ్య సెల్వ రాఘవన్‌తో చేసిన నానే వరువాన్ డిజాస్టర్ కాగా.. భారీ అంచనాలతో వచ్చిన కెప్టెన్ మిల్లర్ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక సొంత డైరెక్షన్‌లో తెరకెక్కిన రాయన్, ఇడ్లీ కడాయ్ సినిమాలు కూడా ప్రేక్షకులను ఒక మోస్తరుగానే ఆడాయి.. కానీ ధనుష్ కోరుకున్న బ్లాక్‌బస్టర్స్ అయితే కాదు. సొంత గడ్డపై సరైన హిట్ కోసం వేచి చూస్తున్న ధనుష్.. ఏప్రిల్ 30న విఘ్నేష్ రాజా తెరకెక్కించిన కర సినిమాతో వస్తున్నారు.. దీనిపైనే ఈయన ఆశలన్నీ ఉన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే కథలో చాలా పెద్ద మ్యాటర్ ఉన్నట్లు అర్థమైపోతుంది.. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. 1991లో గల్ఫ్ యుద్ధం నాటి ఆర్థిక సంక్షోభం బ్యాక్‌డ్రాప్‌లో.. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓ మాజీ దొంగ మళ్లీ పాత దారి ఎందుకు తొక్కాడనే ఇంట్రెస్టింగ్ కథతో కర వస్తోంది. మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ధనుష్‌కు మళ్ళీ కోలీవుడ్‌లో ఆ సాలిడ్ సక్సెస్‌ను అందిస్తుందేమో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారత్‌లో నెల సంపాదన.. విదేశాల్లో ఒక్క రోజులో వస్తోంది..
వేసవి తాపం తట్టుకోవడానికి నిమ్మరసం తాగుతున్నారా.. జాగ్రత్త
త్వరలోనే UPI నుంచి PF డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు
