దసరా పోస్టర్లతో టాలీవుడ్ సందడి.. ఏ హీరో లుక్ ఎలా ఉందంటే!
విజయదశమి సందర్భంగా టాలీవుడ్ మేకర్స్ కొత్త సినిమాల పోస్టర్లతో ప్రేక్షకులకు పండుగ ట్రీట్ ఇచ్చారు. నాగచైతన్య ‘వృషకర్మ’ ఫియర్స్ లుక్, నితిన్ ‘అలియా రుక్మిణి’ రొమాంటిక్ పోస్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజయ్ దేవరకొండ ‘రణబాలి’తో పాటు కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’, విశ్వక్ సేన్ ‘లెగసీ’, వరుణ్ తేజ్ ‘బరి’ వంటి చిత్రాల పోస్టర్లు సోషల్ మీడియాలో ఆసక్తి పెంచాయి. చిన్న సినిమాలు కూడా విభిన్నమైన లుక్స్‌తో సందడి చేశాయి.
విజయదశమి సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన క్రేజీ పోస్టర్స్‌తో సోషల్ మీడియా అంతా పండగ వైబ్స్‌తో నిండిపోయింది. విజయ్ ఫిరోషియస్ లుక్ నుంచి నితిన్ రొమాంటిక్ పోజ్ వరకు కొత్త సినిమాల లుక్స్ ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తున్నాయి. అసలు దసరా బరిలో పోస్టర్స్‌తో డబుల్ ట్రీట్ ఇచ్చిన ఆ సినిమాలు ఏంటి, అందులో ఏ హీరో లుక్ ఎలా అదరగొట్టిందో చూసేద్దామా..? దసరా సందర్భంగా ఏకంగా 20కి పైగా సినిమాల పోస్టర్స్‌ను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు అద్దిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేకర్స్. నాగ చైతన్య వృషకర్మ పోస్టర్‌లో చాలా ఫిరోషియస్‌గా కనిపిస్తుంటే, నితిన్ అలియాస్ రుక్మిణి పోస్టర్‌లో రొమాంటిక్ వైబ్స్ నిండిపోయాయి. సుమంత్ ప్రభాస్ బబ్లూ XXL అంటూ క్రేజీగా పలకరిస్తే.. రణబాలి పోస్టర్ రౌద్ర రూపంతో నిండిపోయింది. కేవలం స్టార్ హీరోలే కాదు.. ఎన్నో చిన్న సినిమాలు కూడా తమ పోస్టర్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ప్రియదర్శ నటిస్తున్న ఇడుపు కాయితం, దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒకతార, శర్వానంద్ జార్జ్ క్రిష్ లాంటి చిత్రాల నుంచి విభిన్నమైన పోస్టర్స్ క్యూరియాసిటీని పెంచేసాయి. వీటితో పాటు గరివిడి లక్ష్మి, డ్యూ డేట్ సినిమాల పోస్టర్స్ కూడా పండుగ పూట ట్రెండ్ అవుతున్నాయి. కుర్ర హీరోలు సైతం దసరా రేసులో ఏమాత్రం తగ్గకుండా కొత్త సినిమాల పోస్టర్స్‌తో వచ్చారు. కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘హైందవ’, గోపీచంద్ ‘భరతవర్ష’, విశ్వక్ సేన్ ‘లెగసీ’ పోస్టర్స్ అభిమానులను అలరిస్తున్నాయి. వీటితో పాటు ‘హుషారు 2’, ‘మహాకాళి’ సినిమాల అప్‌డేట్స్‌తో పాటు వరుణ్ తేజ్ ‘బరి’ సినిమా క్రేజీ పోస్టర్ కూడా దసరా పండుగ సెలబ్రేషన్స్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Yash: తప్పులు కాదు.. సినిమాలు చూడమంటున్న రావణుడు
దేవరగట్టు..తలలు పగిలినా తగ్గేదే లే..ఈ రణరంగం వెనుక చరిత్ర ఇదే
Gold Prices Update: స్థిరంగా బంగారం ధర..తగ్గిన వెండి ధర