Chiranjeevi: రమేష్ కుటుంబానికి చిరంజీవి సాయం!
తీవ్ర బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ‘గబ్బర్ సింగ్’ నటుడు రమేశ్‌కు మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు. ఆయన కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించడంతో పాటు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. మెగా బ్రదర్ నాగబాబు రూ.2 లక్షలు అందించారు. హరీశ్ శంకర్, పవన్ కల్యాణ్ టీమ్ సభ్యులు కూడా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ‘గబ్బర్ సింగ్’ చిత్రం ద్వారా మంచి గుర్తింపు పొందిన నటుడు రమేశ్ ఇటీవల తీవ్ర బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్పందించిన చిరంజీవి, ఆయన కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. రమేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన చిరంజీవి, రమేశ్ భార్యకు రూ.3 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం ఆసుపత్రి వైద్యులతో ఫోన్ ద్వారా మాట్లాడి రమేశ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని కోరడంతో పాటు, ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా కూడా సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు సైతం తన వంతుగా రూ.2 లక్షల చెక్కును అందించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. అంతకుముందు దర్శకుడు హరీశ్ శంకర్, పవన్ కల్యాణ్ టీమ్ సభ్యులు ఆసుపత్రికి వెళ్లి రమేశ్‌ను పరామర్శించారు. కష్టసమయంలో తోటి కళాకారుడికి మెగా కుటుంబం అండగా నిలవడం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
