బంపర్ ఆఫర్ ! ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ! ఏం ప్లాన్ గురూ..!
ప్రభాస్, బన్నీ, చరణ్ - తారక్.. మన ఈ స్టార్ హీరోలు బాలీవుడ్‌ని తమ సినిమాలతో షేక్ చేశారు. దిమ్మతిరిగే వసూళ్లు రాబట్టారు. ఇప్పుడు వీళ్ల తర్వాత ఈ ఘనత సాధించి వీళ్ల పక్కనే చేరిపోయాడు తేజా సజ్జా.! హనుమాన్ సినిమాతో బాలీవుడ్‌లో నేమ్ సంపాదించుకున్న తేజా.. ఇప్పుడు మిరాయ్‌తో హిందీ బెల్ట్‌లో కలెక్షన్స్‌ను భారీ గా వచ్చేలా చేసుకుంటున్నాడు.
ఈ క్రమంలోనే ఈ మూవీ కలెక్షన్స్‌ను మరింతగా పెంచేందుకు దిమ్మతిరిగే ఆఫర్‌ను మార్కెట్లోకి వదిలాడు ఈ మూవీ హిందీ డిస్ట్రిబ్యూటర్ కరణ్ జోహార్. మిరాయ్ సినిమా రైట్స్‌ను దక్కించుకున్న కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్.. ఇప్పుడో ఆఫర్ తో బీ టౌన్‌లో హాట్ టాపిక్ అవుతోంది. మరింత మంది హిందీ ఫిల్మ్ లవర్స్‌కు మిరయ్ సినిమాను చేరువయ్యేలా.. ఆయనో ఆఫర్ ను ప్రకటించాడిప్పుడు. మిరాయ్ సినిమా టికెట్ ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అంటూ… ఆఫర్ ఇచ్చేశాడు. మిరాయ్ హిందీ సినిమాకు మాత్రమే ఈ ఆఫర్ అంటూ కండీషన్ పెట్టాడు. దీంతో మిరాయ్ టికెట్ రేట్లు మరింతగా పెరిగాయని బీ టౌన్ రిపోర్ట్. ఇక మరో రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా బీ టౌన్ ఏరియాలో జస్ట్ మూడు రోజుల్లోనే 10 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. దీంతో తేజా సజ్జా పేరు.. మన పాన్ హీరోల తర్వాత నార్త్‌లో మార్మోగిపోతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మిరాయ్ సినిమాలోరాముడిగా నటించిందెవరో తెలిసిపోయింది..
ఏదో అనుకుంటే ఇంకేదో అయిందే! పాపం శ్రష్టి
Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు.. గుడ్ న్యూస్!
దటీజ్ ప్రభాస్! మనోడి మంచి మనసుకు హ్యాట్సాఫ్
మిరాయ్ డైరెక్టర్‌కు మెగా ఛాన్స్.. స్వయంగా లీక్ ఇచ్చిన కార్తీక్
