Dhurandar 2: ధురంధర్‌ సక్సెస్ విషయంలో బాలీవుడ్ సైలెన్స్‌కు రీజనేంటి ??

Edited By:

Updated on: Mar 28, 2026 | 11:41 AM

ధురంధర్ ది రివెంజ్ భారీ విజయం బాలీవుడ్‌కు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. వసూళ్ల సునామీ సృష్టిస్తున్నా, బాలీవుడ్ స్టార్స్ మాత్రం ఈ సక్సెస్‌ను పట్టించుకోవడం లేదు. ఇందుకు బాలీవుడ్ అంతర్గత రాజకీయాలు, ఖాన్ డామినేషన్, సీనియర్ల అభద్రత, బడా నిర్మాణ సంస్థల ఒత్తిడి కారణమని విశ్లేషకులు అంటున్నారు. సౌత్ స్టార్స్ అభినందిస్తున్నా, సొంత పరిశ్రమ మద్దతు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

బాలీవుడ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సక్సెస్‌ వచ్చింది. సౌత్ సినిమా డామినేషన్‌ ను దాటి వసూళ్ల సునామి సృష్టిస్తోంది ధురంధర్‌ ది రివేంజ్‌. ఇంత గొప్ప సక్సెస్‌ వచ్చినా… బాలీవుడ్ స్టార్స్ మాత్రం ఈ సక్సెస్‌ను ఓన్ చేసుకోవటం లేదు. అసలు ఇలాంటి సినిమా ఒకటి వచ్చిందన్న ఫీలింగ్‌ కూడా వాళ్లలో కనిపించటం లేదు. ఈ పరిస్థితికి కారణం ఏంటి..? ప్రజెంట్ నేషనల్ లెవల్‌లో ధురంధర్‌ మేనియా కనిపిస్తోంది. సీక్వెల్‌తో నేషనల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఈ సినిమా బాలీవుడ్‌కు పూర్వ వైభవం తీసుకువస్తుందన్న ఆశలు కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా బాలీవుడ్ స్టార్స్ మాత్రం ఏమీ పట్టనట్టే ఉన్నారు. ధురంధర్‌ 2 బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్నా… కనీసం ఒక్క ట్వీట్ చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు.ఇంత పెద్ద సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకునే విషయంలో బాలీవుడ్ ఎందుకు వెనుకాడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నా.. సొంత ఇండస్ట్రీ వాళ్లు కనీస మద్దతు ఇవ్వకపోవటం మీద చర్చ జరుగుతోంది. ఇందుకు బాలీవుడ్లోని రాజకీయాలే కారణం అంటున్నారు విశ్లేషకులు. ఖాన్స్‌ డామినేషన్‌కు చెక్‌ పడటం, సీనియర్ల సినిమాలేవి ఆశించిన స్థాయిలో పెర్ఫామ్ చేయకపోవటంతో ఓ యంగ్ హీరో సక్సెస్‌ను వాళ్లు జీర్నించుకోలేకపోతున్నారా అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. ధురంధర్‌ను బాలీవుడ్ పక్కన పెట్టడం వెనుక బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల ఒత్తిడి ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ లైట్‌ తీసుకున్నా మన హీరోలు మాత్రం ధురంధర్‌ ది రివేంజ్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు. గతంలో మన సినిమాలు సూపర్ హిట్ అయినప్పుడు కూడా నార్త్ స్టార్స్ పెద్దగా స్పందించలేదు. కానీ మన హీరోలు మాత్రం వాళ్ల సక్సెస్‌ను కూడా సెల్రబేట్ చేస్తున్నారు. మన హిట్స్‌ను వాళ్లు పట్టించుకోనప్పుడు, వాళ్ల విషయంలో మన వాళ్లు మాత్రం ఎందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారన్న డిస్కషన్ కూడా మొదలైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Drishyam 3: దృశ్యం 3 విషయంలో కన్ఫ్యూజన్.. తెలుగు వెర్షన్ ఉంటుందా ?? లేదా ?? అన్న డౌట్స్‌

స్టైల్ మార్చిన అందాల భామలు

Prabhas: డోంట్ కేర్.. నేను ఫుల్ క్లారిటీ తో ఉన్న అంటున్న డార్లింగ్

సేఫ్ జోన్ వదిలి.. ప్రయోగాలు చేస్తున్న హీరోలు

ఆ సంగీత దర్శకులకు స్పెషల్ క్రేజ్.. ఎందుకో తెలుసా

Follow Us