బాలీవుడ్ స్టార్స్‌లో ప్రాణభయం.. బుల్లెట్ ప్రూఫ్ గ్లాసుల వెనుక హీరోలు!

Updated on: Nov 05, 2026 | 11:27 AM

బాలీవుడ్ స్టార్స్‌ను ప్రాణభయం వెంటాడుతోంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులతో స్టార్ హీరోలంతా తమ భద్రతను పటిష్టం చేసుకుంటున్నారు. సల్మాన్ ఖాన్‌ ప్రధాన లక్ష్యం కాగా, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్‌లు కూడా బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు, పెంచిన సెక్యూరిటీతో రక్షణ పొందుతున్నారు. ముంబై సినీ పరిశ్రమలో ఉద్రిక్తత పెరిగింది.

ముంబై సినీ పరిశ్రమను ఇప్పుడు తీవ్ర భయం వెంటాడుతోంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో బాలీవుడ్ స్టార్స్ ప్రాణభయంతో వణికిపోతున్నారు. టైగర్ ష్రాఫ్ ఘటన అనంతరం ఈ ఉద్రిక్తత మరింత పెరిగింది. తమతో పాటు కుటుంబ భద్రత కోసం స్టార్ హీరోలందరూ హై అలర్ట్ అయ్యారు.ఈ బెదిరింపులలో ప్రధాన లక్ష్యం సల్మాన్ ఖాన్‌పైనే కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం దర్శకుడు వంశీ పైడిపల్లి సినిమాలో బిజీగా ఉన్న సల్మాన్ ఖాన్ షూటింగ్ లొకేషన్స్‌లో భద్రతను ఏకంగా మూడు రెట్లు పెంచారు. ఆయన వెళ్ళే ప్రతిచోటా క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సల్మాన్ ఖాన్ మాత్రమే కాకుండా, బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కూడా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అడ్డు పెట్టుకునే అభిమానులకు కనిపించారు.అలాగే, అక్షయ్ కుమార్ తన బంగ్లాకు అదనపు భద్రతగా బుల్లెట్ ప్రూఫ్ విండోలను ఏర్పాటు చేసుకున్నారు. రణబీర్ కపూర్ సైతం తన చుట్టూ ఉన్న సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసుకున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఈ టెన్షన్స్‌తో ముంబై ఫిలిం ఇండస్ట్రీలోని ప్రముఖులందరూ తమ రక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us