సూపర్ సక్సెస్‌లో బాలీవుడ్.. టాలీవుడ్ మేల్కోవాల్సిన టైమ్ వచ్చేసింది
బాలీవుడ్ పునరుత్తేజం వేగం పుంజుకుంది. 'బార్డర్ 2', 'ధురంధర్' వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి, వందల కోట్లు దాటుతున్నాయి. 2025 బాలీవుడ్‌కు గోల్డెన్ ఇయర్ కానుంది. కంటెంట్ ఆధారిత విజయాలతో బాలీవుడ్ మళ్లీ దూసుకుపోతుండగా, టాలీవుడ్ మేకర్స్ ఈ పోటీని తట్టుకునేందుకు తమ వేగాన్ని మరింత పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
టాలీవుడ్ సూపర్. టాలీవుడ్ కేక.. టాలీవుడ్ అదుర్స్ అంటూ నిన్న మొన్నటివరకు మనల్ని పొగడ్తలతో ముంచెత్తిన బాలీవుడ్ ఇప్పుడు నెమ్మదిగా పుంజుకుంటోంది. నిదానంగా వసూళ్లు కొల్లగొడుతోంది. ఒకదాని వెనుక ఒకటి అంటూ బాలీవుడ్ ప్రాజెక్టులు సక్సెస్ సౌండ్‌ని మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా నా వంతు ఇది అంటూ హిట్ మూవీగా క్లిక్ అయింది బార్డర్ 2. 2025 బాలీవుడ్‌కి గోల్డెన్ ఇయర్ అనే చెప్పాలి. గత కొంతకాలంగా పెద్దగా సౌండ్ చేయని బాలీవుడ్‌కి లాస్ట్ ఇయర్ ఊపిరి పోశాయి సినిమాలు. పెద్దా చిన్నా తేడా లేకుండా, కంటెంట్‌తో సంబంధం లేకుండా ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి బాలీవుడ్ సినిమాలు. ఛావా, ధురంధర్… హిట్ లిస్టులో టాప్‌లో నిలిచాయి. తెర మీద ఏం చెప్పినా సరే.. కన్విన్సింగ్‌గా చెబితే, కంటిన్యూటీ కరెక్ట్ గా ఉండి, బోర్ లేకుండా చెబితే.. సినిమా నిడివి ఎంత సేపున్నా ప్రేక్షకుడు పట్టించుకోడనే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసిన మూవీ ధురంధర్. భాషా సరిహద్దులు దాటి చెలరేగిపోయింది ధురంధర్. వసూళ్లు చూసి అందరూ వావ్ అన్నారు. ఇప్పుడు ధురంధర్ రూట్లోనే ట్రావెల్ చేస్తోంది బార్డర్ 2. బార్డర్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిందీ మూవీ. సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే 100 కోట్లు తెచ్చుకుంది. ఈ వీకెండ్‌కి ఈజీగా 250 కోట్లు వచ్చేలా ఉన్నాయంటున్నారు ట్రేడ్ పండిట్స్. లాంగ్ రన్ ప్లస్ అయితే 500 కోట్లు కూడా చేయడం కన్ఫర్మ్ అనే టాక్ ఉంది. బార్డర్ 2 సినిమా కాస్త సద్దుమణిగేలోపు మార్చిలో ధురంధర్‌కి సీక్వెల్ వచ్చేస్తోంది. ధురంధర్ సీక్వెల్‌లో ఈ సారి రణ్‌వీర్ సింగ్ మాత్రమే కాదు, ఉరి స్టార్ కూడా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఫస్ట్ పార్టులో జరిగిన పొరపాట్లన్నిటినీ సరిదిద్దుకుని సెకండ్ పార్టుతో థియేటర్లలో ల్యాండ్ అవుతానని ఆల్రెడీ చెప్పేశారు ఆదిత్య ధర్. సో… బాలీవుడ్ స్పీడ్ మీదుందన్న విషయం కన్ఫర్మ్ అయింది. దీన్ని ఢీ కొట్టాలంటే ఇంతకు వంద రెట్లు వేగంతో దూసుకుపోవాల్సిన కంపల్సరీ సిట్చువేషన్ ఉన్నారు టాలీవుడ్ మేకర్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: ఒకటీ రెండు కాదు.. పవర్‌స్టార్ మూడు ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నారా
Nithiin: జానర్ మార్చిన నితిన్.. ఈ సారైనా కలిసొస్తుందా
నయన్‌కి హిట్ ఇచ్చిన చిరు.. మరి త్రిష మాటేంటి
Kethireddy Venkatarami Reddy: వైసీపీ నేతలు కేసులకు భయపడే రోజులు పోయాయి
Gold and Silver: జెట్ స్పీడుతో దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలు