ఏడుస్తూ.. హీరోయిన్.. అయినా కానీ సెల్ఫీ కోసం అభిమాని తమషా

Updated on: Jul 08, 2025 | 3:40 PM

ఈ మధ్య అభిమానులు కాస్త హద్దులు మీరుతున్నారు. సెల్ఫీ అంటూ వారు చేసే హడావిడితో తన ఫెవరెట్ యాక్టర్స్‌కు కోపం తెప్పిస్తున్నారు. ఫలితంగా నెట్టింట వైరల్ అవుతూ.. విమర్శల పాలవుతున్నారు. ఓ క్రేజీ ఫ్యాన్ కూడా ఇప్పుడు ఇదే చేశాడు. తన అభిమాన హీరోయిన్ నోరా ఫతేఫీ ఏడుస్తున్నా.. సెల్ఫీ అంటూ ఆమె ముందు తమాషా చేశాడు. ఇప్పుడు నెట్టింట ట్రోల్ అవుతున్నాడు.

నోరా ఫతేహి! బాలీవుడ్‌లో వన్‌ ఆఫ్ ది బ్యూటి ఫుల్ హీరోయిన్ గా క్రేజ్‌ తెచ్చుకున్న ఈమె.. బాహుబలి సినిమాలోని ఇరుక్కుపో స్పెషల్ సాంగ్‌తో తెలుగులోనూ ఫ్యాన్ బేస్ సంపాదించింది. ఇక రీసెంట్‌గా వరుణ్ తేజ్‌ మట్కా సినిమాలో ఓ కీ రోల్ చేసిన ఈ బ్యూటీ… పవన్‌ లేటెస్ట్ మూవీ హరి హర వీర మల్లు సినిమాతో మరికొన్ని రోజుల్లో మన ముందుకు రానుంది. ఇక ఈ క్రమంలోనే… ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఈ బ్యూటీ ఏడుస్తూ కనిపించి అందర్నీ కలవరపెట్టింది. అయితే అదే సమయంలో ఒక అభిమాని నోరాతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఏడుస్తూ వెళుతున్న నటితో ఫొటో తీసుకోవడానికి అభిమాని ప్రయత్నించడంతో నోరా బాడీ గార్డ్ వెంటనే రియాక్ట్ అయ్యాడు. సెల్ఫీ కోసం యత్నించిన యువకుడిని గట్టిగా పట్టుకుని పక్కకు తోసేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే నోరా ఫతేహి ఎందుకు ఏడ్చిందో అనేది ఇప్పటికి సస్పెన్స్‌. కానీ ఎయిర్ పోర్ట్ కు వస్తున్న ముందే ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో అరబిక్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది. నోరా కుటుంబ సభ్యులు లేదా దగ్గరి బంధువుల్లో ఎవరు ఒకరు మరణించి ఉంటారని, అందుకే ఆమె అలా ఏడుస్తూ వెళ్లిందని ఈ వీడియో చూసిన నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సర్కారు ఆఫీసుకు దిష్టి.. పోవటానికి ఏం చేసారో తెలుసా

త్వరలో లక్కీ భాస్కర్2.. సీక్వెల్‌ పై హింట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్

వారణాసిలో హరి హర ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్‌ గా యూపీ సీఎం