Thanuja Puttaswamy: ఫ్యాన్ పై విరుచుకుపడ్డ తనూజ.. సిగ్గు లేదా అంటూ..

Updated on: Mar 02, 2026 | 12:49 PM

బిగ్ బాస్ 9 తర్వాత తనూజ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. సీరియల్స్ లో మృదుస్వభావిగా కనిపించిన ఆమె, బిగ్ బాస్ లో ఫైర్ బ్రాండ్ గా మారింది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ లైవ్ లో పవన్ సాయి గురించి ప్రశ్నించిన నెటిజన్‌కు తనూజ ఘాటుగా సమాధానం ఇవ్వడం సంచలనం సృష్టించింది. ఈ సంఘటన ఆమెలోని మరో కోణాన్ని బయటపెట్టింది, ప్రస్తుతం ఈ రిప్లై వైరల్ గా మారింది.

అప్పటి వరకు తనూజ చేసిన సీరియల్స్ చూసిన వారందరూ.. తనూజను మృదుస్వాభావిగానే భావించారు. చిన్న పిల్ల అనే అనుకున్నారు. కానీ బిగ్ బాస్‌ సీజన్‌9లోకి అడుగుపెట్టింది మొదలు.. తనూజ తనలోని మరో కోణాన్ని తన సీరియల్స్ ఫ్యాన్స్ కి చూపించింది. ఫైర్ బ్రాండ్‌ లేడిలా.. చీటికి మాటికి చిరాకు పడే క్యూట్ అమ్మాయిగా అందరికీ కనిపించింది. తన సడెన్ ట్రాన్సఫార్మేషన్‌తో కట్టా మీటా రియాక్షన్ ను తన ఫ్యాన్స్‌కు కలిగించింది. ఈ క్రమంలో బిగ్ బాస్‌ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ విన్నర్ మాత్రం కాలేకపోయింది. కానీ షో ముగిసిన కొన్ని నిమిషాలకే తనకు ఓటేసిన వారితో పాటు తన ఫ్యాన్స్‌కు స్పెషల్ థాంక్స్ చెప్పింది. కాస్త లేట్‌ అయినా కూడా తాజాగా ఇన్‌స్టాలో తన ఫ్యాన్స్‌లో చిట్ చాట్‌ చేసింది. తన ఫ్యాన్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పింది. కానీ అందులో ఓ ఫ్యాన్ పై మాత్రం ఘరం అయింది. సిగ్గులేదా అంటూ తిట్టేసింది. తనూజ కో యాక్టర్.. తన బ్యాక్ సపోర్టర్‌గా పేరున్న పవన్ సాయి ఇప్పటికీ సీరియల్ మ్యారీడ్ రిలేషన్‌ లో ఉన్నాడు. అయితే ఓ నెటిజన్‌… పవన్‌ సాయి భార్య పేరు ఎత్తుతూ.. పవన్‌ సాయి భార్య కర్మ నిన్ను వదిలిపెట్టదు.. ఆమె ఉసురు వెంటాడుతుంది అంటూ తనూజ కు టెక్స్ట్‌ చేశాడు. ఇక సదరు నెటిజన్ చేసిన టెక్స్ట్‌ చూసిన తనూజ… తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యింది. ‘నీ కర్మ నిన్ను వెంటాడకముందే నీ మీద నువ్వు ఫోకస్ చేసుకో.. నా గురించి బాధపడకు..నేను చాలా బాగున్నా.. అంత బాగానే ఉంది.. నా కర్మ బాగుంది. నీ ఫేస్ చూపించకుండా ఇలాంటి మెసేజ్ పెట్టడానికి సిగ్గుగా లేదా అంటూ ఆ నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం తనూజ ఇచ్చిన రిప్లై స్క్రీన్ షాట్ నెట్టింట వైరలవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rashmika-Vijay Marriage: మొత్తం 3 కిలోల బంగారు ఆభరణాలు.. ‘విరోష్‌’ ఆభరణాల ప్రత్యేకత ఏంటంటే ??

కాయ్ రాజా కాయ్.. ఎంత డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్‌..

Holi: శ్మశానంలో మండుతున్న చితుల మధ్య “హోలీ’ ఎక్కడంటే..

Rashmika-Vijay Marriage: ‘విరోష్’ సునామీ.. సోషల్‌ మీడియాలో రికార్డ్‌ బద్దలు!

రీల్‌ తో చిక్కుల్లో పడ్డ పోలీసులు.. షోకాజ్‌ నోటీసులు..

Follow Us