బిగ్ బాస్‌ 10 ఫస్ట్ కంటెస్టెంట్‌గా.. సీరియల్ బ్యూటీ ఫిక్స్?

Updated on: Jun 17, 2026 | 4:22 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభానికి ముందే కంటెస్టెంట్లపై ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. యాంకర్ వర్ష హోస్ట్ చేస్తున్న టాక్ షోలో పాల్గొన్న నటి ప్రియాంక నల్కారి, అవకాశం వస్తే బిగ్ బాస్‌కు వెళ్తానని వెల్లడించింది. దీనిపై వర్ష సరదాగా ఆమెనే తొలి కంటెస్టెంట్ అంటూ వ్యాఖ్యానించడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈసారి కింగ్ నాగార్జున హోస్ట్‌గా ‘దశావతారం’ అనే వినూత్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. “ఈసారి ఆట మరింత కఠినంగా ఉండబోతోంది” అని తాజా ప్రోమోలోనే హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో హౌస్‌లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్లు ఎవరనే సస్పెన్స్ నెట్టింట నడుస్తోంది. అయితే, అందరికంటే ముందే తొలి కంటెస్టెంట్ పేరును జబర్దస్త్ ఫేమ్, యాంకర్ వర్ష అధికారికంగా కాకపోయినా సరదాగా బయటపెట్టడం ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రస్తుతం వర్ష ఒక టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ షోకి ప్రముఖ సీరియల్ నటి ప్రియాంక నల్కారి అతిథిగా హాజరైంది. ఈ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ ప్రస్తావన రాగా ప్రియాంక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో తనకు తమిళ బిగ్ బాస్, అలాగే తెలుగు బిగ్ బాస్ నుంచి ఆఫర్స్ వచ్చాయని.. కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు వెళ్లలేకపోయానంది. ఒకవేళ ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నుంచి పిలుపు వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తానంటూ చెప్పుకొచ్చింది. ప్రియాంక సమాధానం విన్న వెంటనే యాంకర్ వర్ష కూడా రియాక్టైంది. అయితే బిగ్ బాస్ 10 మొదటి కంటెస్టెంట్ దొరికేసినట్టే. ప్రియాంక నల్కారి ఈ సీజన్ లో అడుగుపెట్టబోయే తొలి కంటెస్టెంట్ అంటూ ప్రకటించేసింది. దీనికి ప్రియాంక కూడా నవ్వుతూ అవునని సైగ చేసింది. ఇలా ఇద్దరూ సరదాగా హింట్ ఇవ్వడంతో.. ఈ విషయం కాస్తా ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ప్రియాంక నల్కారి.. తెలుగు ప్రేక్షకులను సుపరిచితమే.. బుల్లితెరసై పలు పాపులర్ సీరియల్లో ఈమె కీ రోల్ చేసింది. తెలుగులో ‘శ్రావణ సమీరాలు’, ‘మంగమ్మ గారి మనవరాలు’ వంటి సీరియల్స్‌తో పాటు, తమిళంలో సూపర్ హిట్ అయిన ‘రోజా’ సీరియల్ ద్వారా ప్రియాంక భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అలాగే ‘SMS’, ‘కిక్ 2’, ‘కాంచన 3’ వంటి సినిమాల్లోనూ నటించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వర్క్ ఫ్రమ్ బైక్.. అంత ఆత్రం ఎందుకు బాబూ.. బ్రతకాలని లేదా నీకు!

అస్థిపంజరాలు చెప్పిన లక్షల ఏళ్ల నాటి రహస్యం..

Follow Us