CM Sangma: మేఘాలయ రాష్ట్రంలో తెలుగు సినిమా.. CM సంగ్మా ఎమోషనల్

Updated on: Oct 08, 2026 | 3:50 PM

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రంగా ‘బా బా బ్లాక్‌ షీప్‌’ ప్రత్యేక గుర్తింపు సాధించింది. నిర్మాత వేణు దోనేపూడి, చిత్రాలయం స్టూడియోస్‌ తెరకెక్కించిన ఈ క్రైమ్‌ కామెడీ చిత్రం అక్టోబర్‌ 9న విడుదల కానుంది. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ కె. సంగ్మా చిత్రబృందాన్ని అభినందించారు. రాష్ట్రంలోని కొండలు, జలపాతాలు, నదులు, జీవ వేర్ల వంతెనల అందాలను సినిమాతో ప్రపంచానికి చూపించడంపై ఆయన ప్రశంసలు కురిపించారు.

నార్త్‌ ఈస్ట్‌లో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. ప్రకృతి అందాలు.. కొండ కోనలు.. వాగులు వంకలు.. అచ్చం పెయింటింగ్ మాదిరే అక్కడి ప్రదేశాలు కనిపిస్తాయి. కానీ ఈ ప్రదేశాల్లో మాత్రం సినిమా షూటింగ్స్ తక్కువనే చెప్పాలి. కొంత మంది నార్త్‌ ఫిల్మ్ మేకర్స్ తప్పితే.. సౌత్ ఫిల్మ్ మేకర్స్ మాత్రం.. నార్త్‌ ఈస్ట్‌ జోలికి కూడా ఇంత వరకు పెద్దగా వెళ్లలేదు. కానీ బాబా బ్లాక్‌ షీమ్ మేకర్స్ మాత్రం ఇప్పుడీ ఘనత సాధించారు. నార్త్‌ ఈస్ట్లోని మేఘాలయను తమ సినిమాకు షూటింగ్‌ స్పాట్‌ గా ఎంచుకున్నారు. అక్కడ సీఎంతో సంగ్మాతో మాట్లాడి.. సక్సెస్‌ ఫుల్‌గా కంప్లీట్‌గా.. మేఘాలయలోనే సినిమా షూటింగ్ ఫినిష్‌ చేశారు. మేఘాలయలో షూటింగ్ చేసిన ఫస్ట్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ గా తమ బాబా బ్లాక్‌ షీప్ సినిమాతో హిస్టరీ కెక్కారు. ఈక్రమంలోనే మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ఈ మూవీ టీంను ప్రశంసలు కురింపిచారు. అక్టోబ‌ర్ 9న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతున్న ఈ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎస్ ! పూర్తిగా మేఘాలయలో చిత్రీకరించిన తెలుగు క్రైమ్-కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’ 2026 అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్‌, టీజ‌ర్‌, రెండు పాట‌లు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి. ఈ నేప‌థ్యంలో మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా.. బా బా బ్లాక్ షీప్ చిత్ర యూనిట్‌ను ప్ర‌త్యేకంగా అభినందిస్తూ వీడియో విడుద‌ల చేశారు. “ఇది మా రాష్ట్రానికి గర్వకారణమైన క్షణం” అని పేర్కొంటూ.. మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చలనచిత్రం ఇదేనని, ఇది రాష్ట్ర అందాలను మన కొండలకు ఆవల ఉన్న ప్రేక్షకులకు చేరువ చేస్తుందని ఆయ‌న పేర్కొన్నారు. పొగతో నిండిన మంచు కొండలు, అద్భుతమైన జలపాతాలు, స్వచ్ఛమైన నదులు, సజీవ వేర్ల వంతెనలను ఆయన ప్రస్తావిస్తూ..“మన నేలను ప్రపంచంతో పంచుకునేందుకు సినిమా మరో చక్కని అవకాశం” అని చెప్పారు. ఇక ఈ మూవీ ప్రొడ్యూసర్ వేణు దోనేపూడికి, చిత్రాలయం స్టూడియోస్‌కు, నటీనటులకు, సాంకేతిక బృందానికి సంగ్మా అభినందనలు తెలిపారు. “సినిమా చిత్రీక‌ర‌ణ కోసం మేఘాలయ రాష్ట్రాన్ని ఎంచుకున్నందుకు, నమ్మకం ఉంచినందుకు, దాని అందాలను వెండితెరపైకి తెచ్చినందుకు ధన్యవాదాలు” అన్నారు. సినిమా నిర్మాణం రాష్ట్ర యువతకు, స్థానిక సమాజాలకు అవకాశాలనిస్తుంద‌ని, వారు తమ ప్రతిభను చాటుకునేందుకు, కొత్త నైపుణ్యాలు నేర్చుకునేందుకు వీలు కల్పిస్తుందని ఆయన చెప్పారు. మరింత మంది సినీ నిర్మాతలను రాష్ట్రానికి ఆహ్వానించేందుకు ఎదురుచూస్తున్నామని సంగ్మా పేర్కొన్నారు. ఇక అక్టోబ‌ర్ 9న రిలీజ్ అవుతున్న బా బా బ్లాక్ షీప్ చిత్రం హాస్యం, ఊహించని మలుపులు, వైవిధ్య‌మైన‌ పాత్రలతో ప్రేక్ష‌కులను మెప్పిస్తుంద‌ని సంగ్మా తెలిపారు. “తెరపై మేఘాలయ ప్ర‌కృతి అందాలు ఆకట్టుకున్నప్పుడు, దాని అందాన్ని, సంస్కృతిని, ఆత్మీయ ఆతిథ్యాన్ని స్వయంగా అనుభవించేందుకు థియేట‌ర్స్‌కు రండి” అని ఆయన అన్నారు. ఇక చిత్ర నిర్మాత వేణు దోనేపూడి “మేఘాల‌య రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా గారి మద్దతు, ఆద‌ర‌ణ‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మేఘాలయ ప్ర‌జ‌లు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారని.. అక్క‌డి ప్రకృతి దృశ్యాలు, ఆతిథ్యం ‘బా బా బ్లాక్ షీప్’కు ప్రాణం పోశాయంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Varanasi: వారణాసి సినిమాలోకి హాలీవుడ్ హీరోయిన్

చిరు – సింగీతం సినిమా.. మధ్యలోనే ఎందుకు ఆగిపోయిందంటే

Aggipette Macha: ఆ అమాయకపు తింగరి కోపం చెదిరిపోయింది.. ఆ మహామ్మారే బలితీసుకుంది

Loading...
Unable to load recommendations.
Follow Us