Video: మనోడు మామూలోడు కాదుగా.. ఏకంగా పెళ్లే చేసుకోనన్న హీరోయిన్నే పడేశాడు?
ప్రముఖ నటుడు అర్జున్ దాస్, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మిల మధ్య ప్రేమాయణం గురించి కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఐశ్వర్య లక్ష్మి గతంలో పెళ్లి చేసుకోనని ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు, దీనితో ఈ వార్తలు మరింతగా వైరల్ అవుతున్నాయి. ఇద్దరిలో ఎవరైనా స్పందించే వరకు ఈ వార్తలపై స్పష్టత రాదు.
చెన్నైలో పుట్టి పెరిగాడు అర్జున్ దాస్. 2015లో ఓ తమిళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయైన అర్జున్ దాస్ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ఈ నటుడు ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఓజీలోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక ప్రముఖ హీరోయిన్ తో అతను ప్రేమలో ఉన్నాడంటూ రూమర్లు వినిపిస్తుంటాయి. సదరు హీరోయిన్, తాము మంచి స్నేహితులమంటూ వివరణ ఇచ్చాడు. ప్రముఖ దర్శకుడు బాలాజీ మోహన్ తెరకెక్కిస్తోన్న ఓ వెబ్ సిరీస్ లో అర్జున్ దాస్ ఆ క్రేజీ హీరోయిన్ కలిసి నటిస్తున్నారు. దీంతో మరోసారి వీరి లవ్ రూమర్లు నెట్టింట వైరలవుతున్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉండటం వల్లే కలిసి వెబ్ సిరీ్‌సలో నటించారంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ అర్జున్ దాస్ పడిపోయింది ఎవరికో తెలుసా? హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి. మట్టి కుస్తీ తో పాటు పలు సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు చేరువైన ఈ అందాల తారతో అర్జున్ ప్రేమలో ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రజెంట్ ఐశ్వర్య లక్ష్మి తెలుగులో సాయి ధరమ్ తేజ్ సరసన సంబరాల ఏటి గట్టు సినిమాలో నటిస్తోంది.
పిల్లలు లేరని భార్యను వేధించాడు.. అంతే.. భర్తను కత్తితో పొడిచి..
పుష్ప సినిమాకు మించిన స్కెచ్.. మామూలుగా లేదుగా!
వరదకు కొట్టుకొచ్చిన 23 కేజీల బాహుబలి చేప..
నాగుల చవితి పర్వదినాన ఆలయంలో అద్భుతం..
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

