అనిల్ రావిపూడి.. ది మాస్టర్ ఆఫ్ ప్రమోషన్స్

Edited By:

Updated on: Aug 21, 2026 | 10:08 PM

టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి తన సినిమాలను ప్రమోట్ చేసే విభిన్న శైలితో మరోసారి ఆసక్తి రేపుతున్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాకు ‘జనవరి 12 విడుదల’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ప్రకటించారు. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ట్యాగ్‌లైన్‌ను కూడా జోడించారు. షూటింగ్‌తో పాటు ప్రమోషన్స్‌ను ప్లాన్ చేస్తూ, ఖర్చు లేకుండానే సినిమాపై బజ్ క్రియేట్ చేయడంలో అనిల్ మరోసారి తన మార్క్ చూపిస్తున్నారు.

పైసా ఖర్చు లేకుండా ప్రమోషన్ చేయడం ఎలా అనే స్కూల్ ఉంటే.. దానికి ప్రిన్సిపల్‌ అనిల్ రావిపూడి. ఆయన ఆలోచనలు అలా ఉంటాయి మరి. నిర్మాతల జేబులోంచి డబ్బు తీయకుండా.. తన మూవీ గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేయడంలో అనిల్ సిద్ధహస్తుడు. తాజాగా వెంకీ, కళ్యాణ్ రామ్ సినిమాకు అదిరిపోయే టైటిల్ పెట్టారీయన. మరి అదేంటో తెలుసా..? చూస్తున్నారుగా.. షూటింగ్‌కు షూటింగ్, ప్రమోషన్స్‌కు ప్రమోషన్స్.. వేటికవే ప్లాన్ చేసుకుంటున్నారు అనిల్ రావిపూడి. మామూలుగా ఎవరైనా అకేషన్ దొరికితే ప్రమోట్ చేస్తుంటారు.. కానీ అనిల్‌కు అకేషన్‌తో అసలు పనేలేదు. అనుకుంటే చాలు.. అలా రిలీజ్ చేస్తుంటారు. తాజాగా వెంకీ, కళ్యాణ్ రామ్ సినిమాకు జనవరి 12 విడుదల అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు.. బావ బామ్మర్ది సౌజన్యంతో అనేది ట్యాగ్ లైన్. ఓవైపు షూటింగ్ చేస్తూనే.. మరోవైపు ప్రమోషన్స్‌లోనూ జోరు చూపిస్తున్నారు అనిల్. ఆ మధ్య జీవీ ప్రకాశ్‌ను తీసుకున్నామని చెప్పడానికి జంధ్యాల గారి స్టైల్‌లో ఓ సర్‌ప్రైజింగ్ వీడియో రిలీజ్ చేసారు ఈ దర్శకుడు. షూటింగ్ మొదలైందని చెప్పడానికి ఓ వీడియో, అది రాయలసీమ బ్యాక్‌డ్రాప్ అని చెప్పడానికి మరో వీడియో.. అబ్బో అసలు అనిల్ ప్రమోషనల్ వీడియోలు మామూలుగా ట్రెండ్ అవ్వట్లేదు. పండక్కి వస్తున్నపుడు టైటిల్స్ కూడా అలాగే ఉండాలని ఫిక్సైపోయారు అనిల్. అందుకే ఎఫ్ 2కు సంక్రాంతి అల్లుళ్ళు అని పెట్టారు.. ఆ తర్వాత ఏకంగా సంక్రాంతికి వస్తున్నాం అనేసారు.. ఇక మన శంకరవరప్రసాద్ గారుకు పండక్కి వస్తున్నారనే ట్యాగ్ లైన్ పెట్టారు. ఇప్పుడేమో జనవరి 12 విడుదల అంటూ రిలీజ్ డేట్‌తో పాటే టైటిల్‌ను రివీల్ చేసారు. అందుకే మరి అనిల్‌ను కింగ్ ఆఫ్ ప్రమోషన్స్ అనేది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్‌.. స్కూల్‌ను సీజ్‌ చేసిన అధికారులు

రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్‌ చూస్తే వెన్నులో వణుకే!

యూట్యూబ్ వ్యూస్ లెక్కింపులో కీలక మార్పు.. ఆగస్టు 24 నుంచి కొత్త విధానం!

LPG: ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త!

లోన్ తీసుకునే వారికి అదిరిపోయే శుభవార్త! బ్యాంకుల ఇష్టారాజ్యానికి చెక్!

Loading...
Unable to load recommendations.
Follow Us