9 ఏళ్ల నిరీక్షణకు తెర.. నంది అవార్డుల పునరుద్ధరణ

9 ఏళ్ల నిరీక్షణకు తెర.. నంది అవార్డుల పునరుద్ధరణ

Updated on: Nov 28, 2026 | 5:50 PM

తెలుగు సినీ, టెలివిజన్ రంగాల్లో కళాకారులు, సాంకేతిక నిపుణుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులను పునరుద్ధరిస్తూ జీవో జారీ చేసింది. 2017 నుంచి 2025 వరకు పెండింగ్ అవార్డులతో పాటు, గతంలో ప్రకటించిన 2012-2016 సంవత్సరాల అవార్డులను కూడా డిసెంబర్ 2026, నవంబర్ 2026లో ప్రదానం చేయనున్నారు.

తెలుగు సినీ, టెలివిజన్ రంగాల్లో కళాకారులు, సాంకేతిక నిపుణుల తొమ్మిదేళ్ల నిరీక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెరదించింది. చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డుల ప్రదానోత్సవానికి మార్గం సుగమం చేసింది. నిలిచిపోయిన ఈ పురస్కారాలను మళ్ళీ అందించేందుకు అధికారికంగా చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 22న జారీ చేసిన జీవో ఆర్టీ నెంబర్ 1843 ప్రకారం, 2017 నుంచి 2025 వరకు పెండింగ్‌లో ఉన్న అవార్డుల ప్రక్రియను పూర్తి చేసి డిసెంబర్ 2026లో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకకు అమరావతి లేదా విజయవాడ వేదిక కానున్నాయి. 2017 నుంచి 2024 వరకు ప్రతి ఏడాదికి ఉత్తమ ఫీచర్ ఫిలిం, రెండో ఉత్తమ ఫీచర్ ఫిలింతో పాటు రెండు ప్రత్యేక జ్యూరీ అవార్డులను అందించనున్నారు. 2025 సంవత్సరానికి మాత్రం గతంలో మాదిరిగానే అన్ని ప్రధాన విభాగాల్లో అవార్డుల ఎంపిక చేపట్టనున్నారు. నంది టెలివిజన్ అవార్డులను తిరుపతిలో నిర్వహించనున్నారు. 2017 నుంచి 2024 వరకు టీవీ రంగంలోనూ ఉత్తమ మెగా సీరియల్, రెండో ఉత్తమ మెగా సీరియల్‌తో పాటు రెండు ప్రత్యేక జ్యూరీ అవార్డులు ఉంటాయి. 2025కు పూర్తి స్థాయి కేటగిరీలు ఉంటాయి. అంతేకాకుండా, 2012 నుంచి 2016 వరకు ఇప్పటికే ప్రకటించిన నంది ఫిలిమ్స్, టీవీ అవార్డులను, ఆయా సంవత్సరాలకు సంబంధించిన జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవాలను కూడా నవంబర్ 2026లో విజయవాడలో నిర్వహించనున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: డెలివరీ వేళ సమంత ఫ్యామిలీలో టెన్షన్ ! అసలు కారణం ఇదే!

Vrushakarma Trailer: 5 వేల ఏళ్ల నాటి రహస్యం.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వృషకర్మ ట్రైలర్

Kaithi: కార్తి రిక్వెస్ట్ చేయడంతో.. హిట్టు సినిమా వదులుకున్న సేతుపతి

పాకిస్థాన్‌ సిరీస్‌ ఇష్యూ..నెట్‌ఫ్లిక్స్‌కు భారత సినీ కార్మికుల హెచ్చరిక

అలియాస్ రుక్మిణీ ట్రైలర్.. నితిన్‌ను గట్టెక్కిస్తుందా..?

Loading...
Unable to load recommendations.
Follow Us