Rashmika Mandanna: నెట్టింట రష్మిక ఫేక్‌ వీడియో.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లకు కేంద్రం వార్నింగ్

|

Nov 06, 2023 | 9:29 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో మొత్తం ఫేక్ వీడియోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. సామాన్యులనుంచి సెలబ్రిటీల వరకూ అందరూ ఈ ఫేక్‌ వీడియోల బారిన పడుతున్నారు. సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలు మార్పింగ్‌ చేసి, వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ హీరోయిన్‌ రష్మిక మందన మార్ఫింగ్‌ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై కేంద్ర ఐటీశాఖ సహాయమంత్రి, బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ తీవ్రంగా స్పందిచారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో మొత్తం ఫేక్ వీడియోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. సామాన్యులనుంచి సెలబ్రిటీల వరకూ అందరూ ఈ ఫేక్‌ వీడియోల బారిన పడుతున్నారు. సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలు మార్పింగ్‌ చేసి, వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ హీరోయిన్‌ రష్మిక మందన మార్ఫింగ్‌ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై కేంద్ర ఐటీశాఖ సహాయమంత్రి, బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ తీవ్రంగా స్పందిచారు. టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం సరికాదని మండిపడుతున్నారు. ఇండస్ట్రీలో రష్మికకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి చెప్పనక్కర్లేదు. అందుకే ఆమెకు సంబంధించిన ఏ చిన్న ఫొటో అయినా క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. తాజాగా రష్మికకు సంబంధించిన ఓ ఫేక్‌ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో రష్మిక డీప్‌నెక్ బ్లాక్‌ డ్రెస్‌ వేసుకుని లిఫ్ట్‌లో ఉన్నట్లు మార్ఫింగ్‌ చేసి నెట్టింట పోస్ట్‌ చేశారు. ఇది చూసిన నెటిజన్లు, రష్మిక ఫ్యాన్స్‌ తీవ్రంగా స్పందించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెట్రో స్టేషన్‌లో కుప్పకూలిన వ్యక్తి.. ప్రాణం పోసిన జవాన్‌

TOP 9 ET News: వార్2 స్టోరీ లీక్.. NTRది దిమ్మతిరిగే క్యారెక్టర్

Follow us on