Allu Arjun: అల్లు అర్జున్ పై ప్రశంసలు.. చార్టర్డ్ విమానం వదిలి.. ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం

Updated on: Jun 02, 2026 | 5:28 PM

‘పుష్ప’ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్, తన సింప్లిసిటీతో మరోసారి అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు. ‘రాకా’ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్, ముంబై మధ్య తరచూ ప్రయాణిస్తున్న ఆయన, ప్రైవేట్ జెట్‌లకు బదులుగా సాధారణ కమర్షియల్ ఫ్లైట్లనే ఎంచుకుంటున్నట్లు సమాచారం. సినిమా బడ్జెట్‌ను వృథా చేయకుండా నాణ్యత పెంపుకే ప్రాధాన్యం ఇస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

‘పుష్ప’తో పాన్‌ ఇండియా స్టార్‌గా భారీ విజయం అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన సింప్లిసిటీతో మంచి మార్కులు కొట్టేసారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘రాకా’ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్, ముంబై మధ్య తరచూ ప్రయాణిస్తున్నారు. ప్రైవేట్ చార్టెడ్ విమానాలకు బదులు, సాధారణ కమర్షియల్ ఫ్లైట్లలోనే ప్రయాణిస్తూ మంచి ఎగ్జాంపుల్‌ సెట్‌ చేసారు. ‘పుష్ప 2’ సక్సెస్ తర్వాత నిర్మాతలు అల్లు అర్జున్ కోసం లగ్జరీ ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆయన వాటిని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటూ, ఆ బడ్జెట్‌ను సినిమా నాణ్యతను పెంచేందుకు ఉపయోగించాలని ఆయన చెప్పినట్లు సమాచారం. అందుకే, సాధారణ విమాన సర్వీసుల షెడ్యూల్‌కు అనుగుణంగా తన ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటున్నారు. ఇటీవల ‘కల్కి 2’ సినిమా షూటింగ్ కోసం కమల్ హాసన్ కూడా ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే తరహాలో ఆలోచించడంపై ప్రశంసలు వస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమాల కాస్ట్‌ పెరుగుతున్న తరుణంలో, పెద్ద తారలు ఇలా బాధ్యతాయుతంగా వ్యవహరించడం మంచి పరిణామమని సినీ విశ్లేషకులు అంటున్నారు. వ్యక్తిగత విలాసాల కంటే వృత్తికి, సినిమాకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వైఖరికి ఇది నిదర్శనమని అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Satyadev: ‘నన్ను హీరోగా తీసేయ్ అన్నారు.. RGV గారు అలా అంటారనుకోలేదు’

లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ తాతయ్య పెద్ద దర్శకుడా? ఎన్టీఆర్, చిరంజీవి, కృష్ణలతో సినిమాలు చేశాడా?

Follow Us