ఇళయరాజా దెబ్బకు.. అజిత్‌కు షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్
లెజెండరీ సింగర్‌గా ఇళయరాజా.. ఎంత అద్భతంగా మ్యూజిక్ కంపోజ్ చేస్తారో! అంతే టెర్రిఫిక్ గా తన కాపీ రైట్ పిటీషన్స్‌తో.. కోలీవుడ్ మేకర్స్‌కు, హీరోలకు వణుకు పుట్టిస్తారు. రీసెంట్గా అజిత్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ మేకర్స్‌కు కూడా కాపీ రైట్ నోటీసులు పంపించి వారికి షాకిచ్చారు. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో తన పర్మిషన్ లేకుండా తన వింటేజ్ సాంగ్ వాడుకున్నందుకు 5 కోట్లు నష్ట పరిహారం చెల్లించాల్సిందే అంటూ అజిత్ టీంకు నోటీసులు పంపించారు.
వాళ్లు రియాక్ట్ అవకపోవడంతో.. కోర్టుకు వరకు వెళ్లారు. అక్కడ సక్సెస్ అయ్యారు. ఏకంగా అజిత్ సినిమాను ఓటీటీ ప్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలిగించేలా చేశారు. సంగీత దర్శకుడు ఇళయరాజా ఫిర్యాదు కారణంగా నెట్‌ఫ్లిక్స్ నుంచి అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీని తొలగించారు ఓటీటీ నిర్వాహకులు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుమతి లేకుండా తన పాటలను ఉపయోగించారంటూ ఇళయరాజా కోర్టులో పిటిషన్ వేశారు. కాపీరైట్ చట్టానికి ఇది విరుద్దమని, ఆ పాటలను తొలగించడమే కాకుండా.. ఉపయోగించినందుకుగానూ తనకు పరిహారం ఇవ్వాలని ఇళయరాజా కోరారు. దీనిపై విచారణ జరిపిన మద్రాసు కోర్టు.. ఇళయరాజా పాటలను సినిమాలో ప్రదర్శించొద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని తొలగించింది. పాటలను తొలగించి..మళ్లీ సినిమాను అందుబాటులోకి తీసుకొస్తారా లేదా మొత్తానికి స్ట్రీమింగ్ చేయకుండా వదిలేస్తారో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Manchu Lakshmi: చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది..
మిరాయ్ డైరెక్టర్‌కు.. ప్రొడ్యూసర్ దిమ్మతిరిగే సర్‌ప్రైజ్ గిఫ్ట్
Lokesh Kanagaraj: రజినీ – కమల్ కూడా పక్కన పెట్టేశారా ?? పాపం..లోకేష్!
Dil Raju: షార్ట్ ఫిల్మ్‌ల పోటీ.. గెలిస్తే రూ. 3 లక్షలు..
Manchu Manoj: మోహన్ బాబు కొడుకైతే ఏంటి? పాపం! మనోజ్‌కు ఇన్ని కష్టాలు.. కన్నీళ్లా..
