టాలీవుడ్‌ వైపు చూస్తున్న ధురంధర్‌ డైరెక్టర్‌.. లిస్ట్‌లో ఉన్న స్టార్స్‌ వీరే ??

Edited By:

Updated on: Mar 23, 2026 | 5:20 PM

ధురంధర్‌, ధురంధర్ ది రివేంజ్‌ చిత్రాలతో ఆదిత్యధర్‌ మోస్ట్ వాంటెడ్‌ దర్శకుడిగా మారారు. ధురంధర్ 2 రూ. 500 కోట్లు దాటి రూ.1000 కోట్లకు చేరువవుతుండగా, తదుపరి చిత్రంపై ఉత్కంఠ నెలకొంది. తెలుగు స్టార్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్-అల్లు అర్జున్ మల్టీస్టారర్, ప్రభాస్‌తో పాన్ ఇండియా పేట్రియాటిక్ యాక్షన్ డ్రామాపై చర్చ జరుగుతోంది. కమిట్ అయిన అశ్వత్థామ వంటి ప్రాజెక్టుల భవిష్యత్తు కూడా ఆసక్తికరంగా మారింది.

హోల్ ఇండియా ధురంధర్‌ మేనియాలోనే ఉంది. సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధురంధర్ ది రివేంజ్‌, వసూళ్ల సునామి సృష్టిస్తోంది. ఇప్పటికే 500 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసిన ఈ మూవీ మరో రెండు మూడు రోజుల్లో వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఎంటర్‌ అవ్వటం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదిత్యధర్‌ నెక్ట్స్ మూవీ ఏ హీరోతో ఉంటుందన్న డిస్కషన్ మొదలైంది. ఈ లిస్ట్‌లో తెలుగు హీరోల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ధురంధర్‌, ధురంధర్ 2 సినిమాలతో మోస్ట్ వాంటెడ్‌ దర్శకుల లిస్ట్ లో చేరిపోయారు ఆదిత్యధర్‌. గతంలో యురి సినిమాతోనే నేషనల్ లెవల్‌లో గుర్తింపు వచ్చినా.. ధురంధర్‌ మూవీ, కమర్షియల్ స్పేస్‌లో ఆదిత్యధర్‌ ఇమేజ్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది. అందుకే ఆయనతో సినిమా చేసేందుకు టాప్‌ స్టార్స్‌ కూడా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అయితే ఆదిత్యధర్‌ ఎవరితో సినిమా చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ధురంధర్ 2 రిలీజ్‌కన్నా ముందు నుంచే ఈ యంగ్ డైరెక్టర్ టాలీవుడ్‌ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ హీరోగా ఆదిత్యధర్‌ సినిమా ప్లాన్ చేస్తున్నారన్న టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది. కానీ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్‌ రాలేదు. ధురంధర్ 2 రిలీజ్‌ తరువాత కొత్త టాక్ తెర మీదకు వచ్చింది. ఎన్టీఆర్‌, ఆల్లు అర్జున్ కాంబినేష్‌లో ఆదిత్యధర్‌ ఓ భారీ మల్టీస్టారర్‌ ప్లాన్ చేస్తున్నారని, త్వరలోనే ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ కూడా రానుందన్నది నయా అప్‌డేట్‌. దీనికితోడు ఆదిత్యధర్‌ ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు కూడా లైన్‌లో ఉన్నాయి. పాన్ ఇండియా మార్కెట్‌లోకి ఎంటర్‌ అయిన దర్శకుల ఫస్ట్ డ్రీమ్‌ ప్రభాస్‌తో మూవీ. ఆదిత్యధర్‌ కూడా అదే ఆలోచనలో ఉన్నారన్న న్యూస్‌ కూడా ట్రెండ్‌ అవుతోంది. డార్లింగ్ హీరోగా ఓ భారీ పేట్రియాటిక్‌ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేసే ఛాన్స్ ఉందన్నది నార్త్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. ధురంధర్ సిరీస్‌లో మరో ఇన్‌స్టాల్మెంట్ ఉంటుందన్న హింట్ చిత్రయూనిట్ ఇప్పటికే ఇచ్చింది. మరో వైపు అశ్వథ్థామ కథతో ఓ భారీ మైథలాజికల్ మూవీని చాలా కాలం కిందటే ఎనౌన్స్ చేశారు ఆదిత్యధర్‌. దీంతో ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్ట్స్‌నే పట్టాలెక్కిస్తారా..? లేదా తెలుగు హీరోలకే ఓటేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్

సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త.. లేకపొతే కాళీ అవుతుంది మీ ఖాతా

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ.. దివాళా తీయడానికి కారణమేంటి?

భారత్ కు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్

CM Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ఛారిత్రక అధ్యాయం

Follow Us