3 నిమిషాలకు 3 కోట్లు.. ఏ స్టార్ ఫిల్మ్ అయినా.. మనీ మ్యాటర్లో నో కాంప్రమైజ్‌!

Updated on: Jul 16, 2025 | 8:08 PM

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పాత సామెతను.. పదే పదే గుర్తు చేసుకుంటున్నట్టు ఉన్నారు పూజా హెగ్డే. అందుకే అన్నట్టు హీరోయిన్ గా తనకు అవకాశాలు కరువవుతున్న ఈ టైంలో ... స్పెషల్ సాంగ్స్‌ చేసేందుకు సైన్ చేస్తున్నారు. కానీ మనీ మ్యాటర్‌ లో మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు. 2 గంటల సినిమా అయినా.. మూడు నిమిషాల పాటైనా.. తన ప్రజెన్స్‌ ఉంటే 3 కోట్లు తక్కువ కాకుండా సమర్పించాల్సందే అంటున్నారట ఈ బ్యూటీ.

అనడమే కాదు.. కూలీ సినిమా విషయంలోనూ ఇదే చేశారట. రజినీ హీరోగా… కింగ్ నాగ్ విలన్‌గా… లోకేష్ కగరాజ్ డైరెక్షన్లో తెరకెక్కుతన్న మోస్ట్ అవేటెడ్ మూవీ కూలీ. పాన్ ఇండియా రేంజ్‌లో ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మోనికా అనే స్పెషల్ సాంగ్ రిలీజ్ అయింది. అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ సాంగ్‌తో మోనికగా పూజా బేబీ.. సౌబిత్‌తో కలిసి ఆడిపాడింది. తన చిందులతో అందర్నీ ఆకట్టుకుంది. ఈ సాంగ్‌తో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ విషయం పక్కకు పెడితే… అకార్డింగ్ టూ కోలీవుడ్ న్యూస్ మౌనికా స్పెషల్ సాంగ్‌ కోసం పూజా హెగ్డే దాదాపు 3 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్‌గా అందుకుందట. కేవలం మూడు నిమిషాల 35 సెకండ్ల సాంగ్‌ కోసం… ఈ రేంజ్‌ మొత్తాన్ని డిమాండ్ చేసిందట. మేకర్స్ కూడా ఇందుకు అంగీకరించడంతో.. పూజా జాక్ పాట్ కొట్టినట్టుందని అంటున్నారు కొందరు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. హీరోయిన్ గా వరుస ప్లాప్‌లో ఉన్నపూజా హెగ్డేకు ఇప్పుడు అవకాశాలే లేవు. ఈ క్రమంలోనే రజినీ లాంటి స్టార్ హీరో సినిమా చిన్న రోలు వచ్చినా చాలని ఎదురుచూసే తారల మధ్యన .. స్పెషల్ సాంగ్ కోసం పూజా ఈరేంజ్‌ తీసుకోవడం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. పూజా ఎంత గట్టిగా డిమాండ్ చేసుంటుందో అనే కామెంట్ వస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

18 ఏళ్లు ఎదురుచూసినా..ఆ కోరిక తీరకుండానే.. పాపం! కోట

కొంచెం తింటే ఏం కాదులే అనుకుంటున్నారా.. అదే డేంజర్‌

అదేమన్నా బొమ్మ అనుకుంటివా.. ప్రాణాలు తీసే కింగ్ కోబ్రా.. అలా ఎలా నిలబెట్టావ్ అన్న