ప్రభాస్ యాక్షన్‌పై హీరో భార్య దిమ్మతిరిగే రియాక్షన్..

|

Nov 21, 2022 | 8:29 PM

ప్రభాస్ మోస్ట్ అవేటెడ్‌ మూవీ సలార్ పైనే ఇప్పుడు అందరి చూపు ఉంది. రాధేశ్యామ్ మూవీ డార్లింగ్ ఫ్యాన్స్‌ను కాస్త డిస్సపాయింట్‌ చేయడంతో..

ప్రభాస్ మోస్ట్ అవేటెడ్‌ మూవీ సలార్ పైనే ఇప్పుడు అందరి చూపు ఉంది. రాధేశ్యామ్ మూవీ డార్లింగ్ ఫ్యాన్స్‌ను కాస్త డిస్సపాయింట్‌ చేయడంతో.. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరికుంటున్న డార్లింగ్స్ కౌంట్ కూడా రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం తెగ ఆరాట పడేలా చేస్తోంది. అయితే అలాంటి వారి కోసమే.. తాజాగా దిమ్మతిరిగే అప్డేట్ ఇచ్చారు…. హీరో పృథ్వీ రాజ్ భార్య సుప్రియా మీనన్. తన భర్త పృథ్వీ రాజ్ సలార్ సినిమాలో యాక్ట్‌ చేస్తుండడంతో… ఈ సినిమా షూటింగ్‌ స్పాట్‌కు వెళ్లానని సుప్రియా తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేశారు. ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ విజన్‌కు …. ఆయన తెరకెక్కిస్తున్న విధానానికి ఫిదా అయ్యానంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. అంతేకాదు ఈ సినిమాలోని యాక్షన్ బ్లాక్స్ ప్రేక్షకుల ఊహకందని విధంగా ఉంటాయంటూ చెప్పి.. డార్లింగ్ ఫ్యాన్స్ ను తెగ ఖుషీ అయ్యేలా చేశారు. తాను అనుకున్నంత చిన్న సినిమా కాదని.. ఇదో భారీ పాత్ బ్రేక్ సినిమా అంటూ.. రివీల్ చేసి నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Roja: స్టేజ్‌పై తన డ్యాన్సింగ్‌తో.. అందర్నీ అరిపించిన రోజా !!

Published on: Nov 21, 2022 08:29 PM