ఈ శుక్రవారం OTTల్లో సైన్మా జాతర.. ఒక్క రోజే 21 చిత్రాలు స్ట్రీమింగ్‌కు..
శుక్రవారం వచ్చిందంటే ఓటీటీ ప్రేక్షకులకు పండుగే. జూన్ 12న నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఆహా, జీ5 వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లలో దాదాపు 21 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. సూర్య నటించిన కరుప్పు, భూత్ బంగ్లా వంటి చిత్రాలతో పాటు పలు హాలీవుడ్, స్పానిష్, బెంగాలీ కంటెంట్ కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
శుక్రవారం వచ్చిందంటే థియేటర్లలోనే కాదు.. ఓటీటీలో కూడా కొత్త సినిమాల సందడి షురూ అవుతుంది. జూన్ 12 ఫ్రైడే రోజు కూడా పలు భాషలకు చెందిన దాదాపు 21 సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చాయి. అందులో సౌత్ లో సూపర్ డూపర్ హిట్టైన సూర్య కరుప్పుతో పాటే.. బాలీవుడ్ భూత్ బంగ్లా లాంటి సినిమా కూడా ఉంది. అంతేకాకుండా బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ నుంచి సినిమాలతో పాటు పలు ఆసక్తికర వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి.
నెట్‌ఫ్లిక్స్ లో
హిందీ సినిమా భూత్ బంగ్లా
స్పానిష్ మూవీ ‘ఐ యామ్ ఫ్రాంకెల్డా’
హీలీవుడ్ వెబ్ సిరీస్లు ‘ది పాలిగమిస్ట్’ , ‘అవుట్ లాస్ట్ ది జంగిల్, ‘ది రెస్ట్ ఈజ్ ఫుట్‌బాల్- సీజన్ 1 , ఈ ఫ్రైడే నుంచే స్ట్రీమింగ్ అవుతున్నాయి
ఇక అమెజాన్ ప్రైమ్ విషయానికి వస్తే
తెలుగు డబ్బింగ్ సిరీస్ ‘రాఖ్’, తెలగు,తమిళ సూపర్ డూపర్ హిట్ మూవీ కరుప్పు తెలుగులో వీరభద్రుడు జూన్ 12 నుంచే స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితో పాటే హాలీవుడ్ మూవీస్ ‘విజిల్’, ‘ఓవర్ యువర్ డెడ్ బాడీ’, ఎవరీ ఇయర్ ఆఫ్టర్ అనే హాలీవుడ్ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. ఇవే కాకుండా… ఫ్రెండ్ ‘డాగ్51’అనే ఫ్రెండ్ మూవీ కూడా ప్రైమ్‌లో జూన్ 12 నుంచే స్ట్రీమింగ్ కి వచ్చింది.
జియో హాట్‌స్టార్లో
తెలగు డబ్బింగ్ మూవీ ద్రిదమ్, హాలీవుడ్ సిరీస్‌లు ‘అలైస్ అండ్ స్టీవ్’,
‘బిలో డెక్ మెడిటెరియన్-సీజన్ 11 స్ట్రీమింగ్ అవుతోంది.
ఆహాలో
ష్ సీజన్ 3 తెలుగు సిరీస్ ఈ శుక్రవారం నుంచే అందుబాటులోకి వచ్చింది.
జీ5లో …
‘మై హూ నా’ అనే హిందీ రియాలిటీ షో, తార్ఖతా అనే బెంగాలీ సిరీస్ ఈ జూన్ 12 నుంచే అందుబాటులోకి వచ్చింది.
లయన్స్ గేట్ ప్లే లో…
ఇంగ్లీష్ మూవీస్ షెల్టర్ అండ్
విక్కీ క్రిస్టీ బార్సిలోనా .. అందుబాటులోకి వచ్చాయి
సన్ నెక్ట్స్ లో…
తెలుగు మూవీ రమణి కల్యాణం జూన్ 12 నుంచే స్ట్రీమింగ్.
హెబీవో మ్యాక్స్లో
‘దె విల్ కిల్ యూ’ అనే హాలీవుడ్ మూవీ జూన్ 12నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vadde Naveen: బన్నీ ఎదుగుదల.. నన్ను ఆశ్చర్యపరిచింది
Raghava Lawrence: ‘రాజకీయాల్లోకి రావాలా వద్దా?’ ఫ్యాన్స్‌కి లారెన్స్ సూటి ప్రశ్న
Sing Geetham Review: మాటలు లేని పాటల ప్రయోగం హిట్టా..? ఫట్టా..?
