సమ్మర్ 2027 వార్.. మరీ టూ మచ్ గురూ

Edited By:

Updated on: Apr 23, 2026 | 6:41 PM

2026 వేసవి నిరాశపరిచినా, 2027 సమ్మర్‌పై టాలీవుడ్ భారీ అంచనాలు పెట్టుకుంది. ప్రభాస్ 'స్పిరిట్', రాజమౌళి కొత్త చిత్రం, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్, సుకుమార్-రామ్ చరణ్ సినిమా వంటి భారీ చిత్రాలు అప్పుడే 2027 విడుదల తేదీలను లాక్ చేసుకున్నాయి. స్టార్ హీరోలు, దర్శకులు ముందుగానే పక్కా ప్రణాళికతో రాబోయే వేసవికి సిద్ధమవుతున్నారు.

కొన్ని విషయాలు మాట్లాడుకోడానికి భలే విచిత్రంగా అనిపిస్తుంటాయి.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ కూడా అలాంటిదే. అంత విచిత్రమైన టాపిక్ ఏంటబ్బా అనుకోవచ్చు కానీ 2027 సమ్మర్ సీజన్ గురించే ఈ టాపిక్. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. 2026 సమ్మర్‌కే దిక్కులేదు కానీ అప్పుడే మనోళ్లు నెక్ట్స్ ఇయర్ సమ్మర్‌పై కన్నేసారు. మరి ఆ సినిమాలేంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? చూస్తుండగానే 2026 సమ్మర్ వచ్చేసింది.. అలా చూస్తుండగానే వెళ్లిపోతుంది కూడా.. కానీ మన స్టార్ హీరోలు మాత్రం ఒక్కరు కూడా రావట్లేదు. రావాల్సిన పెద్ది, ప్యారడైజ్, విశ్వంభర ఇలా చెప్తూ పోతే చాలా సినిమాలు సమ్మర్ బరి నుంచి తప్పుకున్నాయి. మీడియం రేంజ్ హీరోలు కూడా వేసవిని అనాధలా అలా వదిలేసారంతే. కానీ సమ్మర్ 2027పై ఇప్పట్నుంచే ఫోకస్ చేసారు. 2027 సమ్మర్ సీజన్ ఇప్పట్నుంచే హౌజ్ ఫుల్ అయిపోతుంది. అందరికంటే ముందే మార్చి 5న స్పిరిట్ రానుందని అనౌన్స్ చేసారు సందీప్ రెడ్డి వంగా. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను 2027, మార్చి 5న విడుదల చేస్తామని ప్రకటించారీయన. చెప్పినట్లుగానే షూటింగ్ కూడా మొదలైంది.. చూస్తుంటే ఆన్ టైమ్ వచ్చేలా ఉంది స్పిరిట్. మరోవైపు రాజమౌళి కూడా 2027, ఏప్రిల్ 7న తన వారణాసి డేట్ ఫిక్స్ చేసారు. ఈ సినిమా షూటింగ్ కూడా వేగంగానే జరుగుతుంది. మేలో సమ్మర్ బ్రేక్ ఇచ్చినా.. ఆగస్ట్ నాటికి షూట్ అంతా పూర్తి చేస్తానని ధీమాగా చెప్తున్నారు జక్కన్న. తన గత సినిమాలతో పోలిస్తే వారణాసి షూటింగ్‌లో వేగం పెంచారు రాజమౌళి. సెప్టెంబర్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులతోనే బిజీగా కానుంది వారణాసి టీం. జూన్ 11, 2027న ఎన్టీఆర్, నీల్ సినిమా డేట్ లాకైంది.. మరోవైపు సుకుమార్, రామ్ చరణ్ సినిమాను కూడా సమ్మర్ 2027కే ప్లాన్ చేస్తున్నారు. పెద్ది పూర్తి కాగానే నాన్ స్టాప్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు లెక్కల మాస్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ RC17ను ఏడాదిలో పూర్తి చేయాలనేది సుకుమార్ ప్లాన్. చెప్పుకోడానికి అన్నీ బాగానే ఉన్నాయి కానీ అందులో వచ్చేవెన్నో మరి..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్ ఎంబీబీఎస్

నా చీర లాగాడు !! నాసిక్‌ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన

లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్‌ టాపర్‌

సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా చేసింది

విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు

Published on: Apr 23, 2026 06:41 PM
Follow Us