Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్‌ వెరీ డేంజర్‌.! ఎనర్జీ డ్రింక్ లు తాగే విద్యార్థులు చదువుల్లో వెనక్కి.

|

Jan 30, 2024 | 2:46 PM

ఇటీవల కాలంలో ఎనర్జీ డ్రింక్స్‌ పేరుతో రకరకాల పానీయాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ డ్రింక్ లతో పిల్లల పెర్ఫార్మెన్స్ పెరుగుతుందని వ్యాపార ప్రకటనలు ఊదరగొడుతున్నాయి. ఈ క్రమంలో తల్లిదండ్రులు పిల్లలకు శక్తినిస్తుందని, వారి ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుందని వీటిని పిల్లలకు ఎక్కువగా ఇస్తున్నారు. అయితే ఈ ఎనర్జీ డ్రింక్స్‌ పిల్లలకు శక్తినివ్వకపోగా వారిని అనారోగ్యానికి గురిచేస్తాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.

ఇటీవల కాలంలో ఎనర్జీ డ్రింక్స్‌ పేరుతో రకరకాల పానీయాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ డ్రింక్ లతో పిల్లల పెర్ఫార్మెన్స్ పెరుగుతుందని వ్యాపార ప్రకటనలు ఊదరగొడుతున్నాయి. ఈ క్రమంలో తల్లిదండ్రులు పిల్లలకు శక్తినిస్తుందని, వారి ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుందని వీటిని పిల్లలకు ఎక్కువగా ఇస్తున్నారు. అయితే ఈ ఎనర్జీ డ్రింక్స్‌ పిల్లలకు శక్తినివ్వకపోగా వారిని అనారోగ్యానికి గురిచేస్తాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ఆరోగ్యం కోసం, శక్తి కోసం పిల్లలకు ఇచ్చే పానీయాలతో మేలుకన్నా కీడే ఎక్కువగా జరుగుతోందని బయటపడింది. ఎనర్జీ డ్రింకుల పేరుతో అమ్ముతున్న హై కెఫైన్ డ్రింక్ లతో యువత పలు మానసిక సమస్యలు ఎదుర్కొంటోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. యువతపై ఎనర్జీ డ్రింక్ ల ప్రభావంపై ఇంగ్లాండ్ లోని టీసైడ్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ట్రాన్స్ లేషనల్ రీసెర్చ్ తోపాటు న్యూకాజిల్ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల అధ్యయనం నిర్వహించారు.

ఇందుకోసం 21 దేశాలకు చెందిన 12 లక్షల మందిపై జరిపిన పలు పరిశోధనలను నిశితంగా పరిశీలించారు. ఈ అధ్యయనంలో పలు షాకింగ్ విషయాలు బయటపడినట్లు ప్రొఫెసర్ అమెలియా లేక్ తెలిపారు. ఈ డ్రింక్ ల వల్ల ప్రయోజనంలేకపోగా మానసిక సమస్యలకు కారణమవుతున్నాయని హెచ్చరించారు. మానసిక కుంగుబాటు, ఒత్తిడి, నిద్రకు సంబంధించిన సమస్యలు, చదువులో వెనకబడడం తదితర సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రొఫెసర్ అమెలియా తెలిపారు. ఈ డ్రింక్ ల వినియోగంతో దీర్ఘకాలంలో మరిన్ని అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశౄరు. ఎనర్జీ డ్రింక్ ల అమ్మకానికి వ్యతిరేకంగా పలు స్వచ్చంద సంస్థలతో కలిసి ప్రొఫెసర్ అమెలియా పోరాడుతున్నారు. డ్రింక్ ల అమ్మకాలపై ఆంక్షలు విధించాలని బ్రిటన్ లో పలు ఆందోళనలు కూడా జరిగాయి. దీంతో ప్రభుత్వం స్పందించి పదహారేళ్లలోపు పిల్లలకు ఎనర్జీ డ్రింక్ లు అమ్మొద్దంటూ చట్టం తీసుకొచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Follow us on