Health: పెరుగు, వేయించిన జీలకర్ర పొడి కలిపి తీసుకోండి.. ఫలితం మీరే చూడండి.!

Updated on: Aug 10, 2024 | 6:57 PM

ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నీరు, మధ్యాహ్నం పెరుగు, రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు ఈ మూడూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతారు. పెరుగు అన్ని వయసులవారికి మంచి చేస్తుంది. ఇందులో ప్రొటీన్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అయితే మీరు పెరుగుతో వేయించిన జీలకర్రపొడి కలుపుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు నిపుణులు.

ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నీరు, మధ్యాహ్నం పెరుగు, రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు ఈ మూడూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతారు. పెరుగు అన్ని వయసులవారికి మంచి చేస్తుంది. ఇందులో ప్రొటీన్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అయితే మీరు పెరుగుతో వేయించిన జీలకర్రపొడి కలుపుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు నిపుణులు.

పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థకు మంచిది. ఇందులో ఉండే యాంటీబయాటిక్స్ డయేరియా, మలబద్ధకం సమస్యలను దూరం చేస్తాయి. జీలకర్ర కడుపు నొప్పి, వికారం, అజీర్ణం, అతిసారం, అపానవాయువు మొదలైన వాటిని దూరం చేస్తుంది. పెరుగు ,జీలకర్రను కలిపి రైతా లేదా మజ్జిగ రూపంలో తీసుకుంటే జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా ప్రేగులకు సంబంధించిన అనేక సమస్యలను తొలగిస్తుంది. జీలకర్రలో విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడి, రక్తపోటు, గుండెపోటు, వాపు మొదలైన వాటి నుండి ఉపశమనం లభిస్తుంది.

పెరుగులో జింక్, ఫాస్పరస్, విటమిన్ ఎ మొదలైనవి పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మానికి మెరుపునిచ్చి జిడ్డు చర్మాన్ని కూడా తొలగిస్తాయి. అదే సమయంలో, విటమిన్ ఇ ,యాంటీఆక్సిడెంట్ లక్షణాలు జీలకర్రలో ఉన్నాయి. ఇవి వృద్ధాప్యాన్ని నివారించడంతో పాటు, కేన్సర్, వాపు, ఇన్ఫెక్షన్ మొదలైన వాటి నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. జీలకర్ర తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. అధిక కొవ్వు మరియు కొలెస్ట్రాల్ ఉన్నవారు వేయించిన జీలకర్రను తీసుకుంటే, సమస్య తొలగిపోతుంది. అలాగే స్థూలకాయాన్ని తొలగించడానికి పెరుగు కూడా మంచి ఎంపిక. శరీరం నుండి అదనపు కొవ్వును తొలగిస్తుంది. రక్తపోటు సమస్యతోనూ పోరాడుతుంది. పెరుగులో ఒక చెంచా వేయించిన జీలకర్ర కలిపి ప్రతిరోజూ తింటే బరువు సులభంగా తగ్గుతారు. డయాబెటిక్ రోగులకు డయాబెటిస్‌ సమస్యతో బాధ పడేవారు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అలాగే గుండె మంటను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Loading...
Unable to load recommendations.
Follow Us