మతిమరుపు… గుండెజబ్బుకు సంకేతమా ?? తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు !!

Updated on: May 09, 2026 | 12:24 PM

వయసుతో సంబంధం లేకుండా వచ్చే మతిమరుపు, జ్ఞాపకశక్తి క్షీణత గుండెపోటు లేదా పక్షవాతానికి ముందస్తు హెచ్చరిక కావొచ్చు. తాజా పరిశోధనల ప్రకారం, గుండె జబ్బులకు 3-8 ఏళ్ల ముందు నుంచే ఆలోచన సామర్థ్యం తగ్గుతుంది. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారిలో ఈ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. వీటిని గుర్తించి సకాలంలో వైద్యులను సంప్రదించడం భవిష్యత్ ప్రమాదాలను నివారిస్తుంది.

వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి మందగించడం సహజం. ప్రస్తుతకాలంలో వయసుతో సంబంధం లేకుండా ఈ మతిమరుపుతో సతమతమవుతున్నారు చాలామంది. అయితే.. జ్ఞాపకశక్తి తగ్గడం, తరచూ విషయాలను మర్చిపోవడం వంటి సమస్యలను కేవలం వయసు పెరగడం వల్ల వచ్చే ఇబ్బందులుగానే మనం చూస్తాం. కానీ, ఇవే మున్ముందు రాబోయే గుండెపోటుకు లేదా పక్షవాతానికి ముందస్తు హెచ్చరికలు కావొచ్చని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. సాధారణంగా గుండెజబ్బులు వచ్చిన తర్వాత మెదడు సామర్థ్యం తగ్గుతుంది అంటారు వైద్యులు. గుండెపోటు లేదా గుండె వైఫల్యం సంభవించడానికి సుమారు 3 నుంచి 8 ఏళ్ల ముందు నుంచే వృద్ధుల్లో విషయగ్రహణ సామర్థ్యం వేగంగా తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారిలో ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయని అధ్యయనం వెల్లడించింది. తెలిసిన ప్రాంతాల్లోనే తిరగడానికి ఇబ్బంది పడటం, ఆలోచనలు సక్రమంగా సాగకపోవడం, తరచూ తికమకపడటం, మాట్లాడేటప్పుడు పదాల కోసం వెతుక్కోవడం, విషయాలను విశ్లేషించే వేగం గణనీయంగా నెమ్మదించడం లాంటి లక్షణాలు వీరిలో కనిపిస్తున్నాయి. విషయగ్రహణ సామర్థ్యం క్షీణించడం అనేది గుండెజబ్బులకు తొలి సూచికగా భావించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ లక్షణాలను ముందుగానే గుర్తించడం ద్వారా, భవిష్యత్తులో వచ్చే ప్రాణాపాయ స్థితిని నివారించే అవకాశం ఉంటుందని పరిశోధకులు వివరిస్తున్నారు. కాబట్టి, జ్ఞాపకశక్తిలో మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TVK Vijay: మేనిఫెస్టోలోని హామీలన్నీ విజయ్ తీర్చగలడా ??

Sathi Leelavathi Movie Review: లావణ్య త్రిపాఠి కొత్త సినిమా.. సతీ లీలావతి రివ్యూ.. ఎలా ఉందంటే ??

Godari Gattupaina Review: డీసెంట్ ఎంటర్టైనర్ గోదారి గట్టుపైన రివ్యూ.. ఎలా ఉందంటే ??

తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనం

Weather Update: పగలు మండే ఎండలు.. సాయంత్రానికి చిరుజల్లులు

Follow Us