ఈ రెండు అలవాట్లూ మార్చుకుంటే.. క్యాన్సర్ దూరం!

Updated on: May 30, 2026 | 11:23 AM

క్యాన్సర్‌ను పూర్తిగా నివారించలేకపోయినా, జీవనశైలిలో మార్పులతో దాని ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. పొగాకు, మద్యం అలవాట్లకు దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా అనేక రకాల క్యాన్సర్లను అడ్డుకోవచ్చు. ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయి.

క్యాన్సర్.. ఈ పదం వింటే చాలు.. వెంటనే మనలో ఏదో తెలియని ఆందోళన కలుగుతుంది. ఈ వ్యాధి వస్తే ఇక ప్రాణాలు తీసే వరకూ వదలదని చాలామంది భావిస్తుంటారు. ఒకసారి వస్తే “జీవితాంతం వెంటాడే జబ్బుగా భావించే ఈ క్యాన్సర్.. నిజానికి మన అలవాట్లపైనే ఆధారపడి ఉందంటే మీరు నమ్ముతారా? అవును, ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న క్యాన్సర్లలో ఎక్కువ భాగం మన తప్పుల వల్ల వచ్చేవే. పొగ తాగడం, మద్యం అలవాట్లు మానేసి, లైఫ్‌ స్టైల్‌ మార్చుకుంటే అసలు… ఈ మహమ్మారి మన జోలికి రాకుండా కూడా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కేవలం క్యాన్సర్ రాకుండా అడ్డుకోవడమే కాదు, ఒకవేళ సోకినా ప్రాణాపాయం లేకుండా బయటపడటానికి ఎలాంటి లైఫ్‌స్టైల్‌ ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. పంచంలో చాలా మందిని పట్టి పీడిస్తున్న రోగాలలో క్యాన్సర్ ఒకటి. క్యాన్సర్ వస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిని సైలెంట్ కిల్లర్ అంటారు. దీనిని గుర్తించడం కూడా చాలా కష్టం. పరిస్థితి చెయ్యి దాటే వరకు క్యాన్సర్ జబ్బు బయటపడట్లేదు. శరీరంలోని కణాలు అదుపులేకుండా పెరిగినప్పుడు ఈ క్యాన్సర్ వస్తుంది. అసలు వయసుతో సంబంధం లేకుండా క్యాన్సర్ తో బాధపడుతున్నవారు ఈ మధ్యకాలంలో చాలా మంది ఉన్నారు. క్యాన్సర్ కారణంగా చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కొందరు క్యాన్సర్ ని జయించిన వారు కూడా ఉన్నారు. WHO ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న కోట్లాది మరణాలకు.. రెండవ ప్రధాన కారణం క్యాన్సర్. అయితే, క్యాన్సర్‌లో చాలా రకాలు ఉన్నాయి. ఈ క్యాన్సర్‌ని తొలి దశలోనే గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు. కానీ చాలా మంది వాటిని గుర్తించలేక ప్రాణాలు కోల్పోతున్నారు. శరీరంలో ఏ చిన్న మార్పు వచ్చినా ఉదాహరణకు గడ్డలు, అకస్మాత్తుగా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మరీ ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే… ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 38 శాతం క్యాన్సర్ కేసులను నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO) స్పష్టం చేస్తోంది. ధారణంగా క్యాన్సర్‌ విషయంలో మనమేమీ చేయలేమనే భావిస్తుంటాం. కానీ క్యాన్సర్‌ బారిన పడకుండా తగ్గించుకోవటానికి చాలా మార్గాలే ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ తాజా అధ్యయన విశ్లేషణ ప్రకారం మూడింట ఒకవంతు కన్నా ఎక్కువ క్యాన్సర్లు నివారించుకోదగినవే! ప్రధానంగా పొగాకు, మద్యానికి దూరంగా ఉంటే సుమారు 50% క్యాన్సర్లను నివారించుకునే వీలుండటం చాలా గొప్ప విషయం. న్సర్లకు జన్యు స్వభావం, ఆహార అలవాట్ల దగ్గరి నుంచి పర్యావరణ కాలుష్యం వరకూ రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి. జన్యు స్వభావాన్ని మార్చలేం కానీ జీవనశైలిని మార్చుకోవచ్చు. కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు. ఇలాంటి జాగ్రత్తలతో చాలావరకూ క్యాన్సర్‌ బారినపడకుండా చూసుకోవచ్చు. తాజా అధ్యయనం ఈ విషయాన్ని మరోసారి నొక్కి చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా 2022లో మొత్తం 1.87 కోట్ల కొత్త క్యాన్సర్లు నమోదు కాగా.. 71 లక్షల క్యాన్సర్లు మార్చుకోదగిన 30 కారకాలతో ముడిపడి ఉంటుండటం గమనార్హం. నివారించుకోదగిన క్యాన్సర్లలో దాదాపు సగం ఊపిరితిత్తి, జీర్ణాశయ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లే కావటం ఆలోచించదగ్గ విషయం. క్యాన్సర్‌ ముప్పు కారకాల్లో సిగరెట్లు, చుట్టలు, బీడీలు కాల్చటం.. మద్యం తాగటం, శరీర ఎత్తు-బరువు నిష్పత్తి పెరగటం, తగినంత శారీరక శ్రమ చేయకపోవటం.. గుట్కా, జర్దా వంటి పొగాకు ఉత్పత్తులు నమలటం.. వక్కపొడి తినటం, మహిళలు తమ పిల్లలకు తగినన్ని రోజులు చనుబాలు పట్టకపోవటం, గాలి కాలుష్యం, అతినీలలోహిత కిరణాల ప్రభావం, ఇన్‌ఫెక్షన్‌ కారకాలు, పనిచేసే చోట్ల రసాయనాల ప్రభావం వంటివి ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇక ప్రధానంగా, ప్రవర్తన పరంగా మార్చుకోదగిన క్యాన్సర్‌ ముప్పు కారకాల్లో పొగాకు, మద్యం అలవాట్లే ముందుంటున్నాయి. 2022లో నమోదైన క్యాన్సర్లలో 15% పొగ తాగటంతోనే ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా మగవారికిది ఎక్కువ ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఆ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నిర్ధారణ అయిన కొత్త క్యాన్సర్లలో 23% కేసులకు పొగ తాగటమే కారణమని తేలింది. ఇదొక్కటే కాదు, గాలి కాలుష్యమూ పాలు పంచుకుంటోంది. కాకపోతే ఇది ప్రాంతాల వారీగా మారిపోతోంది. జీవనశైలి అంశాల్లో పొగ తాగటం తర్వాత స్థానం మద్యానిదే. నివారించుకోదగ్గ క్యాన్సర్లకు ఈ రెండే దాదాపు సగం వరకూ కారణమవుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. కానీ, 1970 కాలం నుంచి ఈ వ్యాధి బారిన పడిన వారు కోలుకుంటున్న రేటు మూడింతలు పెరిగింది. ప్రారంభంలోనే ఈ వ్యాధిని గుర్తించడమే దీనికి కారణం. స్తవంగా చాలా రకాల క్యాన్సర్లు తీవ్రంగా ముదరకముందే గుర్తించి చికిత్సను తీసుకోవడం ద్వారా రోగులు ప్రాణాలతో బయటపడుతున్నారు. మస్యేంటంటే ఈ వ్యాధి సోకిన చాలా మంది… డాక్టర్లు చెప్పే మాటలు సరిగా వినిపించుకోవడం లేదు. ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించగలిగే కొన్ని రకాల లక్షణాలను కూడా రోగులు పట్టించుకోవడం లేదు. టా కోటి మందికి పైగా ప్రజలు ఈ మహమ్మారితో చనిపోతున్నారు. అయితే, కొత్త క్యాన్సర్‌ కేసుల్లో సుమారు 10% ఇన్‌ఫెక్షన్లతో ముడిపడి ఉంటున్నాయి. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు దారితీసే హెచ్‌పీవీ ప్రధాన కారణంగా నిలుస్తోంది. అదృష్టం కొద్దీ ప్రస్తుతం దీన్ని నివారించుకోవటానికి టీకా అందుబాటులో ఉంది. ఇక మగవారిలో జీర్ణాశయ క్యాన్సర్‌ ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి పొగ తాగటం, జనసమ్మర్థం మూలంగా ఇన్‌ఫెక్షన్లు, పరిశుభ్రత లోపించటం, స్వచ్ఛమైన తాగునీరు అంతగా అందుబాటులో లేకపోవటం రణమవుతున్నాయి. పరిశోధకులు 2022 నుంచి ఇప్పటివరకూ దాదాపు 19 మిలియన్ల కొత్త క్యాన్సర్ కేసులను విశ్లేషించారు. వీటిలో ఊపిరితిత్తులు, కడుపు, గర్భాశయ క్యాన్సర్లను సులభంగా నివారించవచ్చని వారు గుర్తించారు. క్కమాటలో చెప్పాలంటే- ఇప్పుడు మనం చెప్పుకున్న క్యాన్సర్‌ ముప్పు కారకాలను నిర్మూలించగలిగితే 2022 నుంచి నమోదైన ప్రతి పది క్యాన్సర్లలో సుమారు నాలుగింటిని నివారించి ఉండేవాళ్లం. అంటే ఇన్‌ఫెక్షన్లకు చికిత్స తీసుకోవటం, లైఫ్‌స్టైల్‌ మార్చుకోవటం, మెంటల్‌ స్ట్రెస్‌ తగ్గించుకోవటం, పర్యావరణ కాలుష్య కారకాల పట్ల జాగ్రత్తగా ఉండటం ద్వారా ఏటా కోట్లాది క్యాన్సర్లను అడ్డుకునే వీలుంటుందని మర్చిపోకండి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Aadhaar: ఈ కార్డు మీ దగ్గర ఉందా? అన్నింటికీ ఆధారం అదే! ఈ అప్ డేట్ మిస్సవ్వద్దు!

‘ఇండియన్స్‌ అంటే.. అక్కడ కూలీలే’.. భారతీయ మూలాలపై గర్వంగా చెప్పిన ట్రినిడాడ్ ప్రధాని

Follow Us