ఇంట్లో కర్పూరంతో ఇలా చేయండి.. ఫలితం మీరే చూడండి

Updated on: Oct 27, 2025 | 2:57 PM

సమాజంలో మనిషి మనుగడకు డబ్బు చాలా అవసరం. ఈ ధన సంపాదన కోసం జనం రకరకాల పనులు చేస్తుంటారు. వ్యాపారం, ఉద్యోగం ద్వారా డబ్బు సంపాదిస్తారు. అయితే కొంతమంది ఎంత కష్టపడినా వారిని ఆర్ధిక కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. కుటుంబ పోషణకు సరిపడా సంపాదన లేక, వచ్చిన సంపాదన నిలబడక నానా ఇబ్బందులు పడుతుంటారు.

అలాంటి వారికోసం పెద్దలు చెప్పిన కొన్ని సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎంతో సులువైన ఈ పద్ధతులను పాటిస్తే ధనానికి ఇబ్బంది పడకుండా జీవితం సాఫీగా సాగుతుందని చెబుతారు. ప్రతీ ఇంటి పూజా మందిరంలోనూ కర్పూరం తప్పక ఉంటుంది. రోజూ పూజ అనంతరం దైవానికి హారతి ఇస్తారు. ఈ కర్పూరం ఎంతో విశేషమైనదిగా చెబుతారు. ఈ కర్పూరంతో ఇంట్లోని నెగిటివిటీని పోగొట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. కర్పూరం ప్రతికూల శక్తిని పోగొట్టి ఇంటికి సానుకూలతను తీసుకువస్తుందని చెబుతారు. ఇంటిలోని అనేక సమస్యలను తొలగించడానికి కర్పూరం ఒక అద్భుతమైన మార్గంగా సూచిస్తారు. ఇంట్లో వాతావరణం అశాంతిగా మారినప్పుడు ఉదయం, సాయంత్రం ఇంట్లో కర్పూరం వెలిగించడం వలన ప్రతికూల శక్తి దూరమవుతుంది. ఇంటి వాతావరణం శుద్ధి అవడమే కాకుండా పాజిటివిటీ నెలకొంటుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే.. పూజ చేసే సమయంలో కర్పూరంలో ఒకటి, రెండు లవంగాలు వేసి హారతి ఇవ్వడం ద్వారా ఆర్ధిక సమస్యలు తీరి అదృష్టం కలిసివస్తుందని చెబుతారు. ఇంట్లోని నాలుగు మూలల్లో చిన్న కర్పూరం ముక్కలను ఉంచడం ద్వారా ఇంట్లో మంచి సువాసన రావడమే కాకుండా మనసుకు ప్రశాంతతనిస్తుంది. ఇంట్లోని ప్రతికూలతను తొలగిస్తుంది. శాంతి నెలకొంటుంది. ప్రధాన ద్వారం, పూజ గది ఇలా.. వివిధ చోట్ల కర్పూరం ఉంచడాన్ని చాలా శుభప్రదంగా చెబుతారు. ఇది ఇంట్లో సానుకూల శక్తిని నిర్వహిస్తుంది. ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు తలెత్తుతుంటే బెడ్ రూమ్‌లో అక్కడక్కడా కర్పూరం ముక్కలను ఉంచడం ప్రయోజనకరంగా ఉంటుంది. నిద్రపోయేటప్పుడు దిండు కింద కర్పూరం ఉంచడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని వాటిలో కొన్ని కర్పూరం బిళ్లలు వేసి ఇంట్లోని ఓ మూలన ఉంచడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించడం అనేది వారి వారి విశ్వాసాలకు సంబంధించినదే కానీ..ఎలాంటి ప్రామాణికత లేదని గ్రహించాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేవుడి ప్రసాదాన్ని దొంగిలిస్తారు.. ఎక్కడంటే

క్రెడిట్‌ స్కోర్‌ ఎంతకీ పెరగట్లేదా ?? ఈ తప్పులు చేస్తున్నారేమో చూడండి

అంధులకు కంటిలో చిప్‌ .. టెక్నాలజీ ద్వారా చూపు

కిచెన్‌లో ఏఐ అసిస్టెంట్‌క్షణాల్లో కావాల్సిన రెసిపీ రెడీ

Diabetes: నిద్రతో డయాబెటిక్‌కు చెక్‌..