సబ్బు, షాంపూ, టూత్‌పేస్ట్‌ పైనా కేంద్రం కొత్త రూల్స్‌

Updated on: Sep 23, 2026 | 9:21 PM

సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్ట్‌లు, ఇతర కాస్మోటిక్స్‌, టాయిలెట్రీస్‌ ప్యాకేజింగ్‌కు సంబంధించి కేంద్రం కొత్త సవరణ తీసుకొచ్చింది. సెప్టెంబరు 21న జారీ చేసిన G.S.R. 826(E)లో వెజిటేరియన్‌ ఉత్పత్తులకు గ్రీన్‌ డాట్‌, నాన్‌ వెజిటేరియన్‌ ఉత్పత్తులకు ఎరుపు లేదా బ్రౌన్‌ డాట్‌ గుర్తులపై నిబంధనను మార్చింది. ఈ గుర్తు ప్యాకేజీ ప్రధాన డిస్‌ప్లే ప్యానెల్‌ పైభాగంలో ఉండేలా నిబంధనలో పేర్కొన్నారు. అయితే ఇది తప్పనిసరి గుర్తు కాదనే న్యాయపరమైన అంశం కూడా ఉంది.

మనం రోజూ వాడే సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్ట్‌లు, ఫేస్ క్రీమ్‌ల తయారీలో శాకాహార పదార్థాలు వాడారా లేక జంతువుల కొవ్వుల వంటి మాంసాహార పదార్థాలు వాడారా? అని తెలుసుకోవడం ఇకపై చాలా సులభం కానుంది. నిత్యం వాడే కాస్మోటిక్స్, టాయిలెట్రీస్ ఉత్పత్తులపై శాకాహార , మాంసాహార గుర్తులను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు “లీగల్ మెట్రాలజీ నాలుగో సవరణ నిబంధనలు-2026″ను నోటిఫై చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. ఇప్పటివరకు మనం తినే ఆహార పదార్థాల ప్యాకెట్లపై మాత్రమే ఆకుపచ్చ, ఎరుపు చుక్కలను చూసేవాళ్లం. ఇకపై ఆహారేతర నిత్యవసర వస్తువులపై కూడా ఇవి కనిపించనున్నాయి. ఆకుపచ్చ చుక్క పూర్తిగా శాకాహార పదార్థాలతో తయారైన ఉత్పత్తులపై ముద్రిస్తారు. ఎరుపు లేదా బ్రౌన్ చుక్క జంతు సంబంధిత పదార్థాలు, కొవ్వులు ఉపయోగించిన ఉత్పత్తులపై తప్పనిసరిగా వేయాలి. ఈ గుర్తులను ప్యాకెట్‌పై వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా “ప్రిన్సిపల్ డిస్‌ప్లే ప్యానెల్” పైభాగంలో ముద్రించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. చాలా రకాల సబ్బులు, సౌందర్య సాధనాల్లో జంతువుల కొవ్వును ఉపయోగిస్తుంటారు. దీనివల్ల పూర్తి శాకాహారులు లేదా కొన్ని మతాచారాలు, నైతిక విశ్వాసాలు పాటించే వారు తెలియక వాటిని వాడి ఇబ్బంది పడుతున్నారు. వినియోగదారులకు తాము కొనే ప్రొడక్ట్ గురించి పూర్తి పారదర్శకత, స్పష్టత ఇవ్వడమే ఈ తాజా నిర్ణయం యొక్క ప్రధాన ఉద్దేశం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: పెరిగిన పసిడి.. స్థిరంగా వెండి ధర

Loading...
Unable to load recommendations.
Follow Us