Gold Prices Update: స్థిరంగా బంగారం ధర..తగ్గిన వెండి ధర
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా, వెండి ధర భారీగా తగ్గింది. అక్టోబర్ 21న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,080గా, 22 క్యారెట్ల ధర రూ.1,33,900గా నమోదైంది. మరోవైపు కిలో వెండి ధర రూ.10,000 తగ్గి రూ.2,30,000కు చేరింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా పలు నగరాల్లో బంగారం ధరలు దాదాపు ఒకే స్థాయిలో కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారే సూచనలు కనపడకపోవడంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో బులియన్ మార్కెట్ ఒత్తిడికి గురవుతోంది. కమ్ముకున్న యుద్ద మేఘాలతో డాలర్ ఆధారిత ఆస్తులపై పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు వెనకడుగు వేస్తున్నారు. అదే సమయంలో బంగారం మీదకు కూడా తమ పెట్టుబడులను మళ్లించేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఇవాళ పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అక్టోబరు 21 బుథవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,46,080 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,33,900 పలుకుతోంది. అయితే వెండి ధర మాత్రం కేజీ కి రూ.10,000 తగ్గి రూ.2,30,000 పలుకుతోంది. అక్టోబరు 21 బుధవారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు పరిశీలిస్తే.. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,230 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,34,050 పలుకుతోంది. ముంబై,చెన్నై, కోల్కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,46,080 లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,900 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. కేజీ వెండి ధర రూ.2,30,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు.. తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్ చేసుకొని వెళ్లాలి. బంగారంపై పెట్టుబడి పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం. ఇక్కడ మేం అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాలపిట్టను చూసేదెలా.. దాన్ని పట్టుకుంటే జైలుకే
తగ్గిపోతున్న చందమామ సైజు.. భూమికి ప్రమాదం పొంచి ఉందా!
అంతరిక్షంలోకి వెళ్లిన తొలి పిల్లి .. ఆ తర్వాత..
పుట్టగానే పుష్ప అంటున్న బుడ్డోడు! చిన్నారి వీడియో వైరల్
ఎల్-నినో ముప్పు.. రాష్ట్రంలో తాగునీటి కటకట.. నీటి పొదుపే శ్రీరామరక్ష!
