Gold Price: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం రేటు.. ఇవాళ తులం గోల్డ్ ధర ఇదే
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త. ఈ వారం భారీగా పెరిగిన బంగారం ధరలు వీకెండ్కి తగ్గుముఖం పట్టాయి. నవంబర్ 28న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹540 తగ్గి ₹1,27,860గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర ₹500 తగ్గి ₹1,17,200కు చేరింది. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది.
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది కొంత ఊరట కలిగించే వార్త. ఈ వారం మొదటి నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర వీకెండ్కి వచ్చేసరికి తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల ప్రభావంతో ప్రస్తుతం బంగారం ధరలలో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. దీంతో పసిడి కొనుగోలుదారులు, ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకునేవారు మార్కెట్ కదలికలను ఆసక్తిగా గమనిస్తున్నారు. నవంబర్ 28 శనివారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఈ క్రమంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ₹540 తగ్గి ₹1,27,860 పలుకుతోంది. అదేవిధంగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ₹500 తగ్గి ₹1,17,200కు చేరింది. కేజీ వెండి ధర ₹1,70,000తో స్థిరంగా కొనసాగుతోంది. నవంబర్ 28న దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి: ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,28,010 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹1,17,350 వద్ద ట్రేడ్ అవుతోంది. ముంబై, కోల్కతా, చెన్నైతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹1,27,860, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹1,17,200 పలుకుతోంది. బంగారం కొనుగోలు చేసే ముందు తాజా ధరలను ఒకసారి పరిశీలించడం మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shah Rukh Khan: అనంత్ అంబానీ వీడియోపై షారుఖ్ సీరియస్ ఇన్ఫ్లూయెన్సర్కు లీగల్ నోటీస్
9 ఏళ్ల నిరీక్షణకు తెర.. నంది అవార్డుల పునరుద్ధరణ
Samantha: డెలివరీ వేళ సమంత ఫ్యామిలీలో టెన్షన్ ! అసలు కారణం ఇదే!
Vrushakarma Trailer: 5 వేల ఏళ్ల నాటి రహస్యం.. గూస్బంప్స్ తెప్పిస్తున్న వృషకర్మ ట్రైలర్
Kaithi: కార్తి రిక్వెస్ట్ చేయడంతో.. హిట్టు సినిమా వదులుకున్న సేతుపతి
