Gold Price: బంగారం ధరలకు భారీ షాక్‌.. ఒక్కరోజే రూ.1,520 పతనం

Updated on: Sep 24, 2026 | 9:59 PM

వరుసగా పెరుగుతూ కొత్త గరిష్ఠాలను తాకిన బంగారం ధరలు గురువారం ఒక్కసారిగా దిగివచ్చాయి. సెప్టెంబర్‌ 24న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,520 తగ్గి రూ.1,52,680కు చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.1,400 తగ్గి రూ.1,39,950గా ఉంది. వెండి ధర కూడా కిలోకు రూ.5,000 తగ్గి రూ.2.50 లక్షలకు చేరింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

గత కొన్ని రోజులుగా వరుస ర్యాలీతో కొత్త గరిష్ఠాలను తాకిన పసిడి ధరలు నేడు ఒక్కసారిగా దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు, అమెరికా డాలర్ విలువ, బాండ్ ఈల్డ్స్ గణనీయంగా పెరగడం, అలాగే ముడి చమురు ధరల్లో కనిపిస్తున్న ఒడిదొడుకుల వల్ల గురువారం నాడు బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. పండుగల సీజన్ వేళ పసిడి ప్రేమికులకు, కొనుగోలుదారులకు ఈ ధరల తగ్గుదల పెద్ద ఊరటనిచ్చింది. సెప్టెంబరు 24 గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1520 తగ్గి, రూ.1,52,680 కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1400 లు తగ్గి రూ.1,39,950 లు పలుకుతోంది. ఇక వెండి ధర రూ.5,000 తగ్గి, కేజీ రూ.2,50,000 తో స్థిరంగా కొనసాగుతోంది. సెప్టెంబరు 24 గురువారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు పరిశీలిస్తే.. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,830 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,40,100 పలుకుతోంది. ముంబై,కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,52,680 లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,950 పలుకుతోంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,52,730 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,40,000 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,52,680, 22 క్యారట్ల బంగారం ధర రూ. 1,39,950 పలుకుతోంది. ఇక కేజీ వెండి ధర రూ.2,50,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు.. తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌ చేసుకొని వెళితే మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Balapur Laddu: బాలాపూర్ లడ్డూ వేలం.. సరికొత్త రికార్డులు?

స్కూల్లో పాములు.. భయాందోళనలో విద్యార్ధులు

Loading...
Unable to load recommendations.
Follow Us