ఏప్రిల్ 1 నుంచి మీ చేతికి వచ్చే జీతం మారబోతోందా ??

Updated on: Mar 24, 2026 | 8:32 PM

ఏప్రిల్ 1 నుండి కొత్త ఆర్థిక సంవత్సరం, ఆదాయపు పన్ను నిబంధనలు 2025/2026 అమలులోకి వస్తాయి. కొత్త లేబర్ కోడ్ కూడా శాలరీ స్ట్రక్చర్‌ను మారుస్తుంది. టేక్-హోమ్ జీతం తగ్గవచ్చు, PF పెరుగుతుంది. స్టాండర్డ్ డిడక్షన్ పెంపు మధ్యతరగతికి ఊరట. పాత vs కొత్త పన్ను విధానాల ఎంపిక కీలకం, ఇది మీ పన్ను భారాన్ని తగ్గిస్తుంది.

ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం అమలు అవుతుంది. అలాగే ఈ ఏడాది కొత్త ఆదాయపు పన్ను చట్టం, కొత్త ట్యాక్స్ రూల్స్ అమలులోకి వస్తున్నాయి. ఉద్యోగుల శాలరీ స్ట్రక్చర్‌లోనూ కీలక మార్పులు వస్తున్నాయి. మరి మీ చేతికి వచ్చే జీతం మారబోతోందా? ట్యాక్స్ లెక్కలపై కొత్త రూల్స్ ఎలా ఉన్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 వచ్చే నెల ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం అవుతోంది. ఈరోజు నుంచి ఉద్యోగుల జీతభత్యాల విషయంలో మార్పులు జరగనున్నాయి. మీ టేక్ హోమ్ శాలరీ అంటే ప్రతి నెలా మీ చేతికి అందే క్యాష్‌లో మార్పులు రానున్నాయి. అంతే కాకుండా ఆదాయపు పన్ను చెల్లింపుల విషయంలో కూడా కొత్త రూల్స్‌ అమల్లోకి రానున్నాయి. కొత్త ఆదాయపు పన్ను 2025, కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ నియమావళి 2026, కొత్త లేబర్ కోడ్ అమలులోకి వస్తాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి డిఫాల్ట్ కొత్త పన్ను విధానంలో మార్పులు, పన్ను స్లాబుల పునర్వ్యవస్థీకరణ ఉంటుంది. ఉద్యోగులకు లభించే Standard Deduction పరిమితి పెంపు, కంపెనీలు ఇచ్చే అలవెన్సులు, బేసిక్ పే నిష్పత్తిలో మార్పుల రానున్నాయి. బేసిక్ పే 50 శాతంగా ఉండాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. దీంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం జరిగే కంట్రిబ్యూషన్లలో మార్పులు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025, కార్మిక చట్టాల సంస్కరణల నేపథ్యంలో ఉద్యోగుల సాలరీ పంపిణీలో పలు మార్పులు రానున్నాయి. మీరు ప్రత్యేకంగా పాత పన్ను విధానాన్ని ఎంచుకోకపోతే ఆటోమేటిక్‌గా కొత్త పన్ను విధానం కిందనే మీ పన్ను లెక్కిస్తారు. ఈ కొత్త విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ సెక్షన్ 80C వంటి మినహాయింపులు ఉండవు. కొత్త విధానంలో ఇచ్చే మినహాయింపు పరిమితిని పెంచడం వల్ల మధ్యతరగతి ఉద్యోగులకు మేలు కలుగుతుంది. ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త వేతన నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి బేసిక్ శాలరీ మొత్తం సిటిసిలో కనీసం 50 శాతం ఉండాలి. బేసిక్ శాలరీ పెరిగితే దానికి అనుగుణంగా మీ పీఎఫ్ కంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. పీఎఫ్ వాటా పెరగడం వల్ల నెల నెలా మీ చేతికి వచ్చే క్యాష్‌ కొంచెం తగ్గే అవకాశం ఉంది. కానీ, ఇది మీ రిటైర్మెంట్ సేవింగ్స్‌ను పెంచుతుంది. కేవలం జీతం మారడమే కాకుండా అసలైన మార్పు మీరు చెల్లించే పన్నులో కనిపిస్తుంది. కొత్త పన్ను విధానంలో స్లాబులు సవరించడం వల్ల నిర్దిష్ట ఆదాయం ఉన్నవారికి గతంలో కంటే తక్కువ పన్ను పడే అవకాశం ఉంది. ముఖ్యంగా తక్కువ, మధ్యస్థ ఆదాయ వర్గాల వారికి ఇది ఊరటనిస్తుంది. జీతం పొందే ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చే స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచడం ద్వారా ప్రభుత్వం పన్ను భారాన్ని తగ్గించనుంది. ఇది కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి అదనపు ప్రయోజనంగా మారుతుంది. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు రిటైర్మెంట్ సమయంలో వచ్చే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పై పన్ను మినహాయింపు పరిమితిని కూడా ప్రభుత్వం పెంచింది. ఇది దీర్ఘకాలంలో ఉద్యోగులకు పెద్ద మొత్తంలో పన్ను ఆదా చేయడానికి సహాయపడుతుంది. ఏప్రిల్ 1 నుంచి మీ శాలరీ స్లిప్ చూడటానికి భిన్నంగా అనిపించవచ్చు. మీ బేసిక్ పే, అలవెన్సులు, పన్ను కోతలు అన్నీ కొత్త నిబంధనలకు అనుగుణంగా మారుతాయి. కాబట్టి, పన్ను ఆదా చేసుకోవడానికి, గరిష్ట ప్రయోజనం పొందడానికి ఏ పన్ను విధానం మీకు లాభదాయకమో ఇప్పుడే లెక్కించుకోవడం ఉత్తమం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దడపుట్టించే సైకో క్రైమ్ థ్రిల్లర్ ఇది.. చూడటం మొదలు పెడితే కళ్ళు తిప్పరంతే

Sharwanand: రోహిత్ శర్మ బయోపిక్‌లో శర్వానంద్

మైక్రో ఫైనాన్స్ పేరిట భారీ మోసం.. వివరణ ఇచ్చిన మంగ్లీ

భీకర యుద్దంలోనూ.. పవర్ స్టార్ ఫ్యాన్స్ సంబరాలు

Dhurandhar 2: బన్నీతో దురంధర్ డైరెక్టర్ పాన్ వరల్డ్ ఫిల్మ్

Follow Us