ఫోన్ నంబర్ లింక్ చేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందా? రవాణా శాఖ క్లారిటీ!

Updated on: Sep 30, 2026 | 4:47 PM

డ్రైవింగ్‌ లైసెన్స్‌కు ఫోన్‌ నంబర్‌ లింక్‌ చేయకపోతే ఈ నెలాఖరులో లైసెన్స్‌ రద్దవుతుందంటూ జరుగుతున్న ప్రచారంపై అధికారులు స్పష్టత ఇచ్చారు. ఫోన్‌ నంబర్‌ అప్‌డేట్‌ కోసం ఆర్టీవోకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సారథి పారివాహన్‌ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ సదుపాయం ఉంది. అధికారిక పోర్టల్‌ ప్రకారం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వివరాల్లో మొబైల్‌ నంబర్‌ను అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

డ్రైవింగ్ లైసెన్స్‌కు ఈ నెలాఖరులోపు ఫోన్ నంబర్ లింక్ చేయకపోతే లైసెన్స్ రద్దవుతుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మి రవాణా శాఖ కార్యాలయాలకు పరుగులు తీయవద్దని, భయాందోళన చెందవద్దని ప్రజలకు సూచించారు. లైసెన్స్ గడువు ముగిసినా కొన్ని సడలింపులతో పునరుద్ధరించుకునే వెసులుబాటు ఉంటుందని, అలాంటిది కేవలం ఫోన్ నంబర్ లింక్ చేయలేదనే కారణంతో డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేసే ప్రసక్తే లేదని అధికారులు తేల్చిచెప్పారు. ఒకవేళ ఆన్‌లైన్‌లో ఫోన్ నంబర్ లింక్ చేసేటప్పుడు కొందరికి ‘మీ లైసెన్స్ వివరాలు లేవు’ అని చూపిస్తే ఆందోళన చెందవద్దని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ రవాణా పోర్టల్‌లోని వివరాలు ‘వాహన్ సారథి’ సైట్‌లో పూర్తిగా అప్‌డేట్ కాకపోవడం వల్లే ఇలా జరుగుతోందని స్పష్టం చేశారు. మొబైల్ నంబర్ లింక్ లేదా అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారు ఆర్టీవో ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే సులభంగా చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అందుకోసం అధికారిక వెబ్‌సైట్ sarathi.parivahan.gov.in పోర్టల్‌లోకి వెళ్లాలి. అక్కడ ‘మొబైల్ నంబర్ అప్‌డేట్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మీ ఆధార్ నంబర్ నమోదు చేయగానే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. అనంతరం డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, కొత్త ఫోన్ నంబర్ నమోదు చేసి ‘ప్రొసీడ్’ పై క్లిక్ చేస్తే ప్రక్రియ పూర్తవుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆటో డ్రైవర్‌ను వదలని రామచిలుకలు.. ఇంటి మిద్దెపై చేరి..

విజయవాడ జంక్షన్‌లో రైళ్ల రద్దీకి చెక్.. రైల్వే బైపాస్ లైన్‌ నిర్మాణం

వామ్మో.. గంటన్నర పాటు పడగ విప్పి నిల్చున్న నాగుపాము.. అసలేం జరిగింది?

అయ్యో.. గుడ్లు అనుకొని గోల్ఫ్‌ బాల్స్‌ మింగేసిన పాము.. ఆ తర్వాత

Loading...
Unable to load recommendations.
Follow Us