నెలకు రూ.90 వేల జీతం.. నెలవారీ ఖర్చు రూ.25 వేలు.. రూ.65 వేలు ఆదా.. ఈ ప్లాన్ చూడండి!
ఢిల్లీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న 28 ఏళ్ల కృతిక నెలకు రూ.90 వేల జీతం పొందుతున్నప్పటికీ, కేవలం రూ.25 వేలతోనే తన ఖర్చులను నిర్వహిస్తోంది. అద్దె, కిరాణా, పెట్రోల్, షాపింగ్ వంటి అవసరాలకు మాత్రమే పరిమితమై విలాసాలకు దూరంగా ఉంటోంది. ఆమె పొదుపు విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, మధ్యతరగతి యువతకు ఆదర్శంగా నిలుస్తోందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ప్రస్తుత రోజుల్లో మెట్రో నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఢిల్లీలో నెలకు వేలల్లో జీతం వచ్చినా సరిపోవడం లేదని చాలా మంది బాధపడుతుంటారు. ఢిల్లీలో నివసిస్తున్న 28 ఏళ్ల ప్రభుత్వ మహిళా అధికారిణి మాత్రం తనకు నెలకు 90 వేల రూపాయలు చేతికి వస్తున్నప్పటికీ, కేవలం 25 వేల తోనే తన నెలవారీ ఖర్చులను ఎంతో పొదుపుగా ఖర్చు చేస్తోంది. ఆ బడ్జెట్ వివరాలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 2022 SSC కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ CGL పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ప్రస్తుతం ఢిల్లీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తుంది ‘కృతిక’. తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో పొదుపు వివరాలను తెలిపింది. లెవెల్ 7 ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆమె, విలాసాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని ఎలా అలవాటు చేసుకుందో వివరించింది. ఒక ఫ్లాట్‌మేట్‌తో కలిసి 2BHK ఫ్లాట్‌లో షేరింగ్లో ఉంటోంది. ఆమె వాటా కింద నెలకు రూ. 11,500 అద్దె చెల్లిస్తోంది. వంటమనిషికి నెలకు 5 వేలు ఇస్తుండగా, అందులో కృతిక వాటా 2,500. ఇక కిరాణా సామాగ్రి విషయానికొస్తే.. ఆన్లైన్ డెలివరీ యాప్స్ ద్వారా నెలకు దాదాపు రూ. 4,000 నుంచి రూ. 5,000 వరకు ఖర్చు అవుతుంది. ఖరీదైన క్యాబ్ లేదా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్‌పై ఆధారపడకుండా, ఆమె సొంత స్కూటీని వాడుతోంది. దీనికి పెట్రోల్ ఖర్చు నెలకు కేవలం రూ. 1,500 మాత్రమే. షాపింగ్ కోసం రూ.3,000 నుంచి రూ. 4,000 ఖర్చు చేస్తుంది. బయట తినడానికి లేదా ఆర్డర్ చేయడానికి నెలకు గరిష్టంగా రూ.2,000 మాత్రమే కేటాయిస్తుంది. ఇంట్లో వండిన ఆహారానికీ ఆమె ప్రాధాన్యత ఇస్తుండటం విశేషం. ఓటీటీ వంటి ప్లాట్ ఫామ్ కోసం ఆమె రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. తన స్నేహితులు, సోదరి అకౌంట్లను షేర్ చేసుకోవడం ద్వారా ఈ ఖర్చును పూర్తిగా ఆదా చేస్తోంది. ఈ లెక్కలన్నీ కలిపితే నెలకు 25 వేలు ఖర్చవుతుందని కృతిక రాసుకొచ్చింది. ఢిల్లీ లాంటి నగరంలో అంత తక్కువ ఖర్చు ఎలా సాధ్యం అని ఎవరైనా అనుకోవచ్చు అని కృతిక తెలిపింది. గత నెలలో తను ఒక ట్రిప్‌కు వెళ్లాననీ అలాగే ఒక మంచి మాట్రెస్ పరుపు కొన్నట్లు చెప్పింది. కానీ, వాటిని తను నెలవారీ బడ్జెట్లో కలపలేదట. ఎందుకంటే అవి ఎప్పుడో ఒకసారి పెట్టే ఖర్చులు మాత్రమే అంది. నెలకు రూ.90 వేల జీతం సంపాదిస్తూ కూడా, అనవసరపు ఖర్చులకు చెక్ పెడుతూ దాదాపు రూ. 65 వేల వరకు ఆదా చేస్తున్న కృతిక లైఫ్ స్టైల్‌ను నెటిజన్లు ఎంతో అభినందిస్తున్నారు. మధ్యతరగతి యువతకు, ఉద్యోగులకు ఆమె ఒక చక్కటి బడ్జెట్ రోల్ మోడల్ అని కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Upasana Konidela: త్రిషకు మెగా కోడలి సర్‌ప్రైజ్ గిఫ్ట్..
Dhanush: ధనుష్ పొలిటికల్ ఎంట్రీ పై తండ్రి వ్యాఖ్యలు వైరల్..
ముంబయి వీధుల్లో అడుక్కుంటూ.. అత్యంత దీనస్థితిలో నటి..!
పని మనిషి టోకరా.. నమ్మించి ఇల్లు దోచేసింది!
Blast Zone: బ్లాస్ట్ జోన్ మూవీ సైలెంట్ సెన్సేషన్.. చిన్న సినిమా పెద్ద బ్లాస్ట్
