AC Price: భారీగా పెరగనున్న ఏసీ ధరలు.. ప్రధాన కారణాలు ఇవే

Updated on: Mar 29, 2026 | 12:35 PM

ఎండలు ముదురుతున్న తరుణంలో ఏసీ కొనుగోలుదారులకు చేదువార్త. ముడి పదార్థాల ధరలు, మెరుగైన స్టార్ రేటింగ్ నిబంధనల వల్ల ఏసీల ధరలు 7-8% మేర పెరగనున్నాయి. రాగి, అల్యూమినియం ధరల పెంపు, ప్రభుత్వ కొత్త నియమాలు తయారీ వ్యయాన్ని పెంచుతున్నాయి. రూ.40,000 ఏసీపై సుమారు రూ.3,000 భారం పడుతుంది. ధరలు మరింత పెరగకముందే కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎండలు ముదురుతున్న వేళ ఏసీ కొనుగోలు చేయాలనుకునే వారికి చేదువార్త. రానున్న రోజుల్లో ఎయిర్ కండీషనర్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ముడి పదార్థాల వ్యయం పెరగడం, ప్రభుత్వం కొత్తగా అమలులోకి తెచ్చిన నిబంధనల కారణంగా ఏసీల తయారీ కంపెనీలు ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. ఏసీల ధరలు పెరగడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఏసీల తయారీలో అత్యంత కీలకమైన రాగి , అల్యూమినియం, ప్లాస్టిక్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగాయి. దీనివల్ల ఏసీల తయారీ వ్యయం దాదాపు 8 శాతం పెరిగింది. అలాగే విద్యుత్ ఆదా కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన మెరుగైన స్టార్ రేటింగ్ నిబంధనల వల్ల తయారీలో మరిన్ని మార్పులు చేయాల్సి వస్తోంది. ఇది మరో 4 శాతం అదనపు భారాన్ని పెంచింది. మొత్తంగా తయారీ వ్యయం 12 శాతం వరకు పెరిగినప్పటికీ, జీఎస్‌టీ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే సామాన్య వినియోగదారులపై నేరుగా 7 నుంచి 8 శాతం వరకు భారం పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే, రూ. 40,000 విలువైన ఏసీపై సుమారుగా 3 వేల రూపాయల వరకు ధర పెరగవచ్చు. ధరలు పెరుగుతున్నప్పటికీ, ఏసీల తయారీలో భారత్ స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఏసీల్లో దాదాపు 65 శాతం విడిభాగాలు స్వదేశీ పరిజ్ఞానంతోనే తయారవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో ఏసీల ఉత్పత్తి సామర్థ్యం ఏటా లక్షల యూనిట్లకు పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏసీల అమ్మకాలు కొంత మందగించినప్పటికీ, వచ్చే ఏడాది నుంచి మళ్లీ గిరాకీ పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఏసీ కొనాలనుకునేవారు..ధరలు మరింత పెరగకముందే ఏసీలు కొనుగోలు చేయడం మేలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైరల్‌ కోతికి గర్ల్ ఫ్రెండ్ దొరికింది.. కొత్త స్నేహం, కొత్త జీవితం

సాగర తీరంలో అద్భుతం.. మూడు కాళ్లపై నిలబడే వింత చేప

ఇన్‌స్టా, FB అడిక్షన్‌.. ఆ యువతిలో మానసిక సమస్యలు!

MS Dhoni: ధోనీకి ఇష్టమైన పాట ఇదేనట..స్వయంగా వెల్లడించిన ఏఆర్ రెహమాన్!

Loading...
Unable to load recommendations.
Follow Us