ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌కు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి బలి
ఆన్లైన్లో అక్రమంగా బరువు తగ్గించే ఇంజెక్షన్ల విక్రయాలను టీజీ సేఫ్ అధికారులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నుంచి భారత్‌కు సరఫరా అవుతున్నట్లు తేలింది. అమెరికాలో ఇంకా క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న ఈ ఇంజెక్షన్లను, "పరిశోధనల కోసం మాత్రమే" అనే లేబుల్‌తో విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులు, విక్రయదారులపై నిఘా కొనసాగుతోంది.
ఆన్లైన్ గేమ్స్ ఆడవద్దని ఎన్నిసార్లు చెప్పినా కొందరు విద్యార్థులు పెడచెవిన పెట్టి, వాటికి బలైపోతున్నారు. తాజాగా, బాసర ట్రిపుల్ ఐటీలో ఇలాంటి విషాద ఘటనే చోటు చేసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌కు బలై చల్లా సంపత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గదిలో ఉరివేసుకుని సంపత్ ప్రాణాలు తీసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన సంపత్, ఇటీవల ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌లో భారీగా రెండు లక్షల రూపాయలు కోల్పోయాడు. ఆర్థికంగా నష్టపోయిన సంపత్, తన పెదనాన్న నుంచి లక్ష రూపాయలు, తల్లి విజయ అకౌంట్ నుంచి మరో 50 వేల రూపాయలు ఫీజుల పేరుతో అప్పుగా తీసుకున్నాడు. ఈ డబ్బును కూడా బెట్టింగ్‌లోనే పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. తన కుమారుడికి స్నేహితులే బెట్టింగ్ అలవాటు చేశారని సంపత్ తల్లి విజయ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంపత్ ఫోన్, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. భైంసా ప్రభుత్వ హాస్పిటల్లో పోస్ట్‌మార్టమ్ అనంతరం సంపత్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.
