Roasted Corn: వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటున్నారా? అయితే, ఇది మీ కోసమే.!

|

Aug 10, 2024 | 7:06 PM

వర్షాకాలంలో మొక్కజొన్న పొత్తులు ఎక్కువగా లభిస్తాయి. వర్షాకాలం చల్లటి సాయంత్రం వేళ వేడి వేడి మొక్కజొన్న కంకులు తింటుంటే ఆ మజానే వేరు. ఈ మొక్కజొన్న కంకులు తినడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే, ఈ మొక్కజొన్నలు కేవలం టైమ్‌పాస్‌ స్నాక్‌ మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు. మొక్కజొన్నలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

వర్షాకాలంలో మొక్కజొన్న పొత్తులు ఎక్కువగా లభిస్తాయి. వర్షాకాలం చల్లటి సాయంత్రం వేళ వేడి వేడి మొక్కజొన్న కంకులు తింటుంటే ఆ మజానే వేరు. ఈ మొక్కజొన్న కంకులు తినడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే, ఈ మొక్కజొన్నలు కేవలం టైమ్‌పాస్‌ స్నాక్‌ మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు. మొక్కజొన్నలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. తద్వారా వ్యాధులను నివారిస్తుంది. మొక్కజొన్నలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు నియంత్రణలో సహాయపడుతుంది. మొక్కజొన్నలో విటమిన్ ఎ, బి, ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. మొక్కజొన్నలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. గ్యాస్, ఎసిడిటీని దూరం చేస్తుంది. అంతేకాదు, వర్షాకాలంలో వచ్చే కండ్ల కలక వంటి సమస్యల్ని దూరం చేస్తుంది.

వర్షంలో తడవడం వల్ల లేదా తేమ ఎక్కువగా ఉండటం వల్ల వానాకాలంలో జుట్టు ఎక్కువగా రాలుతుంది. అంటువంటి పరిస్థితుల్లో మొక్కజొన్నలోని పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. మొక్కజొన్న గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మొక్కజొన్నలో కాపర్, ఐరన్‌తోపాటు మరిన్ని ఆవశ్యక ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకల్ని బలంగా మార్చడంలో సహాయపడతాయి, కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడతాయి. కిడ్నీలో రాళ్లు రాకుండా నివారించడంలో దోహదపడతాయి. రక్తహీనతతో బాధపడేవారు మొక్కజొన్న గింజలు తినడం మంచిది. వీటిలోని ఫోలిక్ యాసిడ్ రక్తహీనతను తగ్గించి ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on