3D టెక్నాలజీతో పేదల ఇళ్లు.. ఏపీలో 3 లక్షల గృహాలకు శంకుస్థాపన!
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను వేగంగా సాకారం చేసేందుకు 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీని వినియోగించనున్నారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెంలో పైలట్ ప్రాజెక్ట్ కింద మొత్తం 175 ఇళ్లను ఈ సాంకేతికతతో నిర్మించనున్నారు. తక్కువ సమయంలో, తక్కువ వ్యర్థాలతో ఇళ్ల నిర్మాణం చేపట్టడం దీని ప్రత్యేకత. భూకంపాలు, తుఫానులు, తీవ్ర ఉష్ణోగ్రతలను తట్టుకునేలా డిజైన్లు రూపొందించనున్నట్లు అధికారులు తెలిపారు.
పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవాత్మక అడుగులు వేస్తోంది. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ కింద రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం భూమిపూజ చేసారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్రమంత్రి పెమ్మసాని పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన ఆకర్షణ నిర్మాణ రంగంలోకి తీసుకొస్తున్న అత్యాధునిక 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా చేపడుతున్న ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద బుర్రిపాలెంలో 100, ఓబులనాయుడుపాలెంలో 75… మొత్తం 175 ఇళ్లను ఈ సాంకేతికతతో నిర్మించనున్నారు. నెలల తరబడి సాగే సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలుకుతూ, అత్యంత వేగంగా, తక్కువ వ్యర్థాలు మరియు తక్కువ శ్రమతో బలమైన ఇళ్లను నిర్మించడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. భూకంపాలు, తీవ్ర ఉష్ణోగ్రతలు మరియు తుఫానుల వంటి ప్రకృతి విపత్తులను తట్టుకునేలా అత్యున్నత ఇంజినీరింగ్ ప్రమాణాలతో ఈ డిజైన్లు రూపొందించారు. రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసిన ఏపీ ప్రభుత్వం, కేంద్రంతో జరిపిన సంప్రదింపుల ఫలితంగా ఇటీవల అదనంగా 3 లక్షల ఇళ్ల కేటాయింపు పొందింది. ఈ కొత్త ఇళ్లకు శంకుస్థాపన చేయడంతో పాటు, వచ్చే మార్చి నాటికి మరో 4.20 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. బుర్రిపాలెంలో ఈ 3D ప్రింటింగ్ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పేదల గృహనిర్మాణానికి ఇదే మోడల్‌ను వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొబైల్ రీఛార్జ్‌తో రూ.లక్ష ప్రమాద బీమా.. రూ.10వేల సైబర్ ప్రొటెక్షన్..
ఒకే ఒక్క సిగరెట్.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్!
Putin: అక్కడ గనక దాడి చేస్తే అణు బాంబులేస్తాం.. పుతిన్ వార్నింగ్